తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి పెన్షన్, ఇళ్ల స్థలాలు కేటాయించాలి:
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి పెన్షన్, ఇళ్ల స్థలాలు కేటాయించాలి: భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 10: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం తగిన గుర్తింపు నిచ్చి, పెన్షన్‌తో పాటు ఇళ్ల స్థలాలు, గృహాలు మంజూరు చేయాలని భీమారం మండల ఉద్యమకారుల సంఘం (2001) నాయకులు డిమాండ్ చేశారు. మండల తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ సదానందం కి తెలంగాణ ఉద్యమకారులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో అణచివేతకు గురైన తెలంగాణ ప్రజల హక్కులు, సంపద...