అమెరికన్ దేశంలోనీ మార్కెట్లోకి తెలంగాణ బియ్యం.
అమెరికన్ దేశంలోనీ మార్కెట్లోకి తెలంగాణ బియ్యం. హైదరాబాద్, అక్టోబరు 23, (అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 23. తెలంగాణలోని రాష్ట్రము లోని రైతులు పండించిన బియ్యం త్వరలో అమెరికా మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. హనుమకొండ జిల్లా ముల్కనూర్ గ్రామానికి చెందిన రైతులు తమ బ్రాండెడ్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామీణ రైతుల సమష్టి కృషికి ప్రతీకగా నిలిచిన ముల్కనూర్ కోఆపరేటివ్ రూరల్ క్రెడిట్ అండ్ మార్కెటింగ్ సొసైటీ ఈ దిశగా కీలక అడుగు వేసింది. అమెరికాకు చెందిన హార్వెస్ట్‌లింక్ సహకార సంస్థతో కలిసి...