రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.
కమాన్ పూర్, నవంబర్ 5. అర్జున్ సమాచారం డెస్క్.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది అని బి ఆర్ ఎస్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాటికొండ శంకర్ అన్నారు. గురువారం వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఎంపీడీవో మరియు తహసిల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలను అందజేశారు.
కమాన్ పూర్ మండల పరిధిలో వరి పంటలు కోతల సమయం వచ్చినప్పటికి దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి గురువారం బీఆర్ఎస్ నాయకులు ర్యాలీగా ప్రభుత్వ మండల ప్రజా పరిషత్, తహసీల్దార్ కార్యాలయాలకు చేరుకుని త్వరితగతిన వరి దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల విక్రయ ఇబ్బందులు తొలిగించాలని కోరుతూ.. తహసీల్దార్ వాసంతికీ, ఎంపీడీవో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ వంశీకృష్ణలకు వినతి పత్రాలు అందజేశారు.
ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. మండలంలో వరి కోతలు జరుగుతున్నప్పటికి కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు దాన్యం విక్రయించడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో మధ్య దళారులను ఆశ్రయించి రైతులు నష్టపోయే పరిస్థితి నెలకుందన్నారు.
ప్రక్కన పెద్దపల్లి నియోజకవర్గంలో గత వారం రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికి మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గంలోని కమాన్ పూర్ మండలంలో ఇప్పటికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇప్పటికైనా మండలం పరిధిలో సెర్ఫ్, పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లేని యెడల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, నాయకులు గుర్రం లక్ష్మీమల్లు, కొండ వెంకటేష్, చిందం తిరుపతి, రాచకొండ రవి, నీలం శ్రీనివాస్, జాబు సతీష్, , రాచకొండ చంద్రమౌళి, పెండ్లి నారాయణ, పొట్ల సతీష్, కొయ్యడ సంపత్, పంతకాని రవి, నడిగొట్టు సంపత్, పొట్ల శంకర్, కొండిల్ల ఓదెలు, గుర్రం శంకర్, ఒడ్నాల సతీష్, షేక్ మొహినుద్దీన్, దండే రమేష్ ఠాగూర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.