ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 3:35 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

నాగబాబుకు జోడు పదవుల రచ్చ..

నాగబాబుకు జోడు పదవుల రచ్చ..

గుంటూరు, సెప్టెంబర్ 12, (అర్జున్ సమాచారం డెస్క్ సెప్టెంబర్ 13.)

జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ, ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌ (కేబినెట్‌ హోదా) కొణిదెల నాగబాబు చిక్కుల్లో పడ్డారా?. ఆయనకు జోడు పదవుల వివాదం తలనొప్పిగా మారబోతుందా?. సోషల్

మీడియా వేదికగా అదే చర్చ జరుగుతోంది.. జోడు పదవుల అంశం తెరపైకి వచ్చింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం జోడు పదవులు ఉండకూడదంటూ సోషల్ మీడియా వేదికగా కొత్త చర్చ మొదలైంది.

గతంలో జయా బచ్చన్‌పై జోడు పదవులతో అనర్హత వేటు పడిందని.. ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబుపై అనర్హత వేటు పడుతుందని కొందరు ట్వీట్‌లు చేశారు.ఏపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ నాగబాబును ఏపీ గ్రీన్‌

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌‌గా నియమించి కేబినెట్ హోదా కల్పించింది. ఆయన జీతభత్యాలు, అలవెన్సులకు సంబంధించి జీవోలో పేర్కొన్నారు. అయితే ఏదైనా ఉభయ సభల్లో సభ్యులుగా ఉన్నవారు ఇతర

లాభదాయక పదవుల్లో ఉండకూడదని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(1)(ఏ)ని గుర్తు చేశారు.. ఒక వ్యక్తి అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ,

ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ లాభదాయకమైన పదవిలో ఉంటే.. వారి రాష్ట్ర శాసనసభ లేదా శాసనమండలి సభ్యుడిగా పదవిలో కొనసాగడానికి అనర్హుడవుతారని రాజ్యాంగంలో స్పష్టం ఉందని పేర్కొన్నారు.

ఈ నిబంధనను ఉల్లంఘిస్తూ ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ హోదా, నెలకు 3.80 లక్షల రూపాయల జీతభత్యాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది నూటికి నూరు శాతం

ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ (లాభదాయక పదవి) కిందకు వస్తుంది కాబట్టి ఎమ్మెల్సీ నాగబాబు మీద అనర్హత వేటు పడుతుందని చెప్పుకొచ్చారు. నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఉండగానే మళ్లీ ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌

కమిటీ ఛైర్మన్‌ పదవి కేబినెట్ ర్యాంకుతో ఇవ్వడం, వేతనం పొందడం రాజ్యంగ విరుద్దమనేది కొందరి వాదన.. ఇదే అంశాన్ని ట్వీట్‌లో ప్రస్తావించారు.గతంలో జయాబచ్చన్‌పై ఇలాగే అనర్హత వేటు

పడిందంటున్నారు. జయా బచ్చన్ గతంలో సమాజ్‌వాదీ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న సమయంలో.. మళ్లీ ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఛైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. భారత

రాజ్యాంగం ప్రకారం ఈ పదవి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ (లాభదాయక పదవి) పరిధిలోకి వస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది. జయా బచ్చన్‌ రాజ్యసభ ఎంపీ పదవిపై మార్చి 2006లో అనర్హత వేటు పడింది.

జయా బచ్చన్ మాత్రమే కాదు మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయని చెబుతున్నారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(1)(ఏ) ప్రకారం.. ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ప్రభుత్వం నుంచి

వేతనం, ప్రతిఫలం వచ్చే మరో లాభదాయక పదవి (ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్)లో ఉండకూడదు. ఒకవేళ లాభదాయక పదవిని చేపడితే ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ పదవిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది.

ఈ రూల్‌నే ప్రధానంగా నాగబాబు విషయంలో ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో నాగబాబుపై అనర్హత వేటు పడకుండా ఏపీ ప్రభుత్వానికి మరో వెసులుబాటు కూడా ఉందనే వాదన వినిపిస్తోంది. ఇక్కడ

మినహాయింపు చట్టాన్ని ప్రధానంగా గుర్తు చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం.. రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేకంగా చట్టం చేసి కొన్ని పదవులకు ఈ అనర్హత నుంచి మినహాయింపు ఇచ్చే అధికారం కూడా ఉందని

కొందరు గుర్తు చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ వేతనాలు, పింఛన్ల చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం, 1953  ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్పొరేషన్లు, సొసైటీలు, కమిటీల ఛైర్మన్ పదవులను ఈ

మినహాయింపు జాబితాలో చేరుస్తుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నాగబాబు ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌ పదవిని.. అనర్హతల తొలగింపు చట్టం ప్రకారం.. మినహాయింపు పొందిన పదవిగా గుర్తించాల్సి

ఉంటుంది. అప్పుడు న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఉండవనే మరో వాదన తెరపైకి వచ్చింది. రెండు పదవుల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు ఒక పదవికి మాత్రమే ఆర్థిక వేతనం తీసుకోవడం, రెండో పదవికి

అలవెన్సులను కేవలం అధికారిక ఖర్చులకు మాత్రమే పరిమితం చేయొచ్చు. అప్పుడు లాభదాయక పదవి వివాదం రాకుండా చూడొచ్చు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాగబాబు పదవిని అనర్హతల

తొలగింపు చట్టం పరిధిలోకి తీసుకొచ్చినా.. నిబంధనల ప్రకారం ఆర్థిక ప్రయోజనాల విషయంలో మార్పులు చేస్తే చట్టబద్ధమైన పదవిగా మారుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో

ప్రస్తావిస్తున్న అంశాలపై ఏపీ ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.