మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వల్ గ్రామ మత్స్య సహకార సంఘం ఎన్నిక ఏకగ్రీవం.
జన్నారం ప్రతినిధి :అర్జున్ సమాచారం అక్టోబర్ 3 :
ఈరోజు మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో జరిగిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
గ్రామంలోని మత్స్యకారులందరూ ఐక్యంగా ఉండి, సంఘ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఏకగ్రీవంగా తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులకు గ్రామస్తులు, మత్స్యకారులు శుభాకాంక్షలు తెలిపారు.
కవ్వాల్ గ్రామ మత్స్యకారులు చూపిన ఐక్యత అభినందనీయమని, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మత్స్యకారులకు స్వర్ణయుగం వస్తుందని అన్నారు. గ్రామంలోని కవల చెరువును అభివృద్ధి చేసి, ఎక్కువ చేప పిల్లలు విడుదల చేసి మత్స్యకారుల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాబోయే రోజుల్లో కవ్వాల్ గ్రామంతో పాటు జన్నారం మండలంలోని అన్ని చెరువులకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కమిటీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
అధ్యక్షులు: పేరు లకావత్ బన్సీ నాయక్ ,ఉపాధ్యక్షులు: భానోత్ అక్య,ప్రధాన కార్యదర్శి బోడజలపతి నాయక్,డైరెక్టర్ బాదావత్ శ్రీనివాస్ నాయక్,బోడా కొమురు నాయక్,బోడ,విజయ్ కుమార్,రాథోడ్ దివరావ్,లకావత్ బలి రామ్.లకావత్ తిరుపతి
ఎన్నికైన అధ్యక్షులు లాకవత్ బన్సీ నాయక్ మాట్లాడుతూ ఈ సంఘానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని వారు అన్నారు.