ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 1:48 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతే సేవా భావం – స్వచ్ఛ భారత్ కార్యక్రమం.

సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతే సేవా భావం – స్వచ్ఛ భారత్ కార్యక్రమం.

జగిత్యాల ప్రతినిధి :అర్జున్ సమాచారం అక్టోబర్ 3::

భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్ గారి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని స్థానిక చింతకుంట చెరువు వద్ద నిర్వహించిన “స్వచ్ఛ-భారత్” కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జగిత్యాల్ నియోజకవర్గం ఇంచార్జ్ బోగ శ్రావణి.

ఈ సందర్భంగా బోగ శ్రావణి మాట్లాడుతూ…

ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ప్రజలకు సూచించారు. పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు.

స్వచ్ఛత అనేది కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనూప్ రావు,జగిత్యాల పట్టణ అధ్యక్షులు కశెట్టి తిరుపతి, కౌన్సిలర్లు వేముల శ్రీనివాస్,నిమ్మల నాగరాజు,గట్టిపెళ్లి గ్యానేశ్వర్, సిరిపురం శ్రీనివాస్ జిల్లా పట్టణ పదాధికారులు మరియు వివిధ మోర్చాల అధ్యక్షులు ఎస్సీ మోర్చా నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు.