గుండి గ్రామ రవాణా సమస్య పరిష్కరించాలి.డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, నియోజకవర్గ ఇన్చార్జి శ్యామ్ నాయక్‌కు వినతి,
అర్జున్ సమాచారం. అక్టోబర్ 2. స్టాఫ్ రిపోర్టర్(కొమురం భీం ఆసిఫాబాద్):
గుండి గ్రామ రవాణా సమస్యను పరిష్కరించాలని కోరుతూ గుండి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్యామ్ నాయక్‌లను కలిసి వినతిపత్రం సమర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లారు.
గుండి పెద్దవాగుపై 2006-07 సంవత్సరంలో ప్రారంభమైన వంతెన నిర్మాణం ఇప్పటికీ అసంపూర్తిగా ఉండటంతో గ్రామ ప్రజలు తీవ్ర రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో అత్యవసర సమయాల్లో కూడా రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగా గుండి గ్రామం నుంచి బోర్డ గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టేలా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన చర్యలు తీసుకోవాలని నాయకులు వినతిపత్రంలో కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మొహార్లే విశ్వనాథ్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ దాన్పెల్లి శ్యామ్ రావు, వార్డ్ మెంబర్ల ఫోరం ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు బట్టుపల్లి ప్రవీణ్ చారి, గుండి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుసోషల్ మీడియా కన్వీనర్ కిరణ్, యువకుడు సాంగ్డే సాయి తదితరులు పాల్గొన్నారు.