బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేస్తూ ముగ్గురు మృతి.
హైదరాబాద్: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 24.
హైదరాబాద్ లోని బాచుపల్లి పరిధిలో ఉన్న దినేశ్ హారిక్ అపార్టుమెంటులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసే క్రమంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హెచ్ఆర్ ఇన్వెస్టిస్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కంపెనీకి చెందిన సుమన్ (24), సురేష్ (25), పవన్ (25)గా పోలీసులు గుర్తించారు. వీరు ట్యాంకులోకి దిగి శుభ్రం చేస్తుండగా ఊపిరాడక చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.కార్తీక పౌర్ణమి రోజే ఈ ఘటన జరగడంతో స్థానికంగా విషాదం అలుముకుంది, బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరణానికి గల కారణాలను విశ్లేషించి పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.