ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 7:16 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

బెల్లంపల్లి కల్వరి మైదానంలో ఉపవాస దీక్ష ప్రార్థనల ముగింపు సభకు పటిష్ట బందోబస్తు,బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్.

బెల్లంపల్లి కల్వరి మైదానంలో ఉపవాస దీక్ష ప్రార్థనల ముగింపు సభకు పటిష్ట బందోబస్తు,బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్.

అర్జున్ సమాచారం అక్టోబర్ 15 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి.

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జోన్ కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్లంపల్లి కల్వరి మైదానంలో గత 50 రోజులుగా కొనసాగుతున్న ఉపవాస దీక్ష ప్రార్థనల ముగింపు సభ సందర్భంగా చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ముగింపు సభకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున,వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.సభా ప్రాంగణం వద్ద ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, భక్తుల రాకపోకలకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ప్రజలు మరియు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ముగింపు సభ ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని డీసీపీ సూచించారు.