హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు,
15 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సంఘంలో చేరిక.. మంచిర్యాల జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యం….
అర్జున్ సమాచారం.నవంబర్ 20,మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల: టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖకు చెందిన హాజీపూర్ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న 15 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సంఘంలో సభ్యత్వం తీసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించేందుకు సంఘం నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులందరూ సంఘటితంగా ఉండి సంఘ బలోపేతానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
మంచిర్యాల జిల్లాలో ఇంకా సభ్యత్వ నమోదు పూర్తికాని మిగిలిన యూనిట్లలోనూ త్వరితగతిన కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాను సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యమని అన్నారు. అదే విధంగా ఉద్యోగ సంఘాల ఐక్యత, సమన్వయం ద్వారా మంచిర్యాల జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఉద్యోగుల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ఇదే ఉత్సాహంతో మిగిలిన యూనిట్లలోనూ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షుడు నరేందర్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, మందమర్రి యూనిట్ అధ్యక్షుడు సుమన్, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.