ఆనవాయితీగా మహిళల గాజుల సంబరాలు
ఆనవాయితీగా మహిళల గాజుల సంబరాలు అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 6 | ముత్తారం రిపోర్టర్ ముత్తారం మండల కేంద్రంలో మహిళల అక్కాచెల్లెళ్ల ఆడబిడ్డల గాజుల సంబరాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముత్తారం ఉపసర్పంచ్ అమ్ము రజిత శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ అమ్ము రజిత శ్రీనివాస్ మహిళా వార్డు సభ్యులకు, మహిళా మూర్తులకు గాజులు అందజేసి గాజుల వేడుకను ప్రారంభించారు. అనంతరం మహిళలు ఒకరికొకరు గాజులు వేసుకుంటూ, స్వీట్లు తినిపించుకుంటూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు....