చిలకలూరి పేటలో విషాదం: క్రాకర్స్ షాపులో , ఒకరి మృతి.
అర్జున్ సమాచారం డెస్క్ సెప్టెంబర్ 19.
చిలకలూరిపేట మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బొప్పిడి ఆంజనేయ స్వామి గుడిని ఆనుకుని ఉన్న ‘కె.ఎస్.ఎస్ క్రాకర్’ (KSS Crackers) దుకాణంలో ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో మంటల్లో చిక్కుకుని ఇద్దరు వ్యక్తులు చిక్కుకొనగా, ఒక వ్యక్తి ప్రభుత్వాసుపత్రులకు తరలించగా ఒక గంటలో దుర్మరణం చెందారు. ఇంతటి భయానక వాతావరణం నెలకొని ప్రాణనష్టం జరిగినప్పటికీ, సంబంధిత అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేయకుండా కేవలం ప్రేక్షకపాత్ర వహిస్తూ వేడుక చూస్తుండటం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగ సీజన్ను కాసుల వర్షంగా మార్చుకునే క్రమంలో వ్యాపారులు కనీస భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేశారు. జాతీయ రహదారిపై వెలసిన ఏ ఒక్క దుకాణంలోనూ కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించిన దాఖలాలు లేకపోవడం శోచనీయం. భద్రతా ఏర్పాట్లు కేవలం తూతూమంత్రంగానే సాగుతున్నాయని, వాస్తవానికి అక్కడ రక్షణ చర్యలు శూన్యమని ఈ ఘటనే స్పష్టం చేస్తోంది. మరోవైపు, సంబంధిత అగ్నిమాపక శాఖ అధికారుల తీరు తీవ్ర విమర్శలపాలవుతోంది. ముందస్తుగా నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకునే అధికారులు.. ఇలాంటి ప్రాణాపాయ ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రమే హడావిడి చేయడం వారి ఘోర వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. కాగా, ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కళ్లెదుటే మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి వలనే పరిస్థితి మరింత విషమించిందని, తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.