ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 4:00 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం.భార్యాభర్తల ఆత్మహత్య.

లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం.భార్యాభర్తల ఆత్మహత్య.

హైదరాబాద్. అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 10.

లాలాగూడ పరిధిలోని విజయపురి కాలనీలో విషాదం నెలకొంది.  భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఉరి వేసుకుని ఒకరు, రైలు కింద పడి మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ముందుగా విజయపురి కాలనీలో భార్య లక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుంది. నిద్ర లేచి భార్య మృతదేహాన్ని చూసిన భర్త చరణప్ప, భయంతో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. లాలాపేట్ రైల్వే బ్రిడ్జి వద్ద రైలు కిందపడి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకేరోజు భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందారు. ఏడాదిన్నర క్రితమే చరణప్ప, లక్ష్మి వివాహం జరిగింది. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు వెల్లడించారు. చరణప్ప నాచారంలో ఫుట్పాత్పై టీ స్టాల్ నిర్వహిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
===========================