డీసీఎం వ్యాన్ ను ఢీకొని ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం.
అర్జున్ సమాచారం. ఆగస్టు7..ముత్తారం. ప్రతినిధి
ఆగివున్న డిసిఎమ్ వ్యాన్ ను డీ కొని గోదావరిఖని నివాసి దాడి రాజేందర్ (65) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ముత్తారం మండలం కేశనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముత్తారంలో నిర్మాణ పనులు పూర్తిచేసుకుని ముత్తారం నుండి గోదావరిఖనికి పనులు ముగించుకొని TVS XL ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తున్న రాజేందర్ శ్రీనివాస్ హోటల్ ముందు రోడ్డు పక్కన నిలిపి ఉన్న డీసీఎం వ్యాన్ ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.డీసీఎం వ్యాన్ డ్రైవర్ హోటల్‌లో అన్నం తినేందుకు వాహనాన్ని రోడ్డుపక్కన నిలిపి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మృతుడు నిర్మాణ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తూన్న రాజేందర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బాదిత కుటుంబం కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది సంఘటన స్థలానికి ముత్తారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ట్లు తెలిపారు