ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 7:16 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మూడు రోజుల ప్రసవ వేదనతో బాధపడుతున్న గొర్రెకు చికిత్సమృతిచెందిన గొర్రె పిల్లను బయటకు తీసి తల్లి గొర్రెను కాపాడిన వెటర్నరీ అసిస్టెంట్ రేఖ

మూడు రోజుల ప్రసవ వేదనతో బాధపడుతున్న గొర్రెకు చికిత్సమృతిచెందిన గొర్రె పిల్లను బయటకు తీసి తల్లి గొర్రెను కాపాడిన వెటర్నరీ అసిస్టెంట్ రేఖ.

అర్జున్ సమాచారం./ముత్తారం రిపోర్టర్. సెప్టెంబర్ 21.

ముత్తారం మండలంలోని మచ్చుపేట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి జట్ట వేన రాజయ్యకు చెందిన గొర్రె మూడు రోజులుగా ప్రసవ వేదనతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. ప్రసవం కాకపోవడంతో రాజయ్య వెటర్నరీ సిబ్బందిని సంప్రదించారు.

సమాచారం అందుకున్న వెటర్నరీ అసిస్టెంట్ రేఖ వెంటనే స్పందించి గొర్రెను పరీక్షించారు. పరీక్షలో గొర్రె కడుపులోనే పిల్ల మృతిచెందినట్లు గుర్తించారు. దీంతో జాగ్రత్తగా చికిత్స నిర్వహించి, మృతిచెందిన గొర్రె పిల్లను బయటకు తీశారు.

అనంతరం తల్లి గొర్రెకు అవసరమైన వైద్యం అందించి ప్రాణాలను కాపాడారు. సకాలంలో స్పందించి తన గొర్రెను కాపాడిన వెటర్నరీ అసిస్టెంట్ రేఖకు గొర్రెల కాపరి రాజయ్య కృతజ్ఞతలు తెలిపారు.