క్రీడల్లో గెలుపోటములు సహజం:
కమాన్ పూర్. అర్జున్ సమాచారం డెస్క్ సెప్టెంబర్ 4.
క్రీడల్లో గెలుపోటములు సహజమని, వాటిని సమానంగా స్వీకరించాలని ఏరియా నాణ్యత విభాగాధిపతి యండి.ఆసిఫ్ యాసిన్ అన్నారు.
రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని వర్క్ పీపుల్ స్పోర్ట్స్ & గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణం నందు ఓసీ-1, ఓసీ-2, ఏ.ఎల్.పి వివిధ విభాగాల క్రీడాకారుల మధ్య ఇంటర్ డిపార్టుమెంటల్ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించారు.
ఈ పోటీలను ఏరియా నాణ్యత విభాగాధిపతి యండి.ఆసిఫ్ యాసిన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం వివిధ క్రీడలలో పోటీలను నిర్వహిస్తుందన్నారు. కావున నిత్యం ఉద్యోగులు సాధన చేస్తూ, నైపుణ్యం సాధిస్తూ ముందుకెళ్లాలన్నారు. అంతేకాకుండా రీజినల్ స్థాయి, కంపెనీ స్థాయి, కోల్ ఇండియా స్థాయిలలో నిర్వహించు పోటీలలో నైపుణ్యాన్ని ప్రదర్శించి మన ఏరియా పేరు నిలబెట్టాలని కోరారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, వాటిని సమానంగా స్వీకరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు యం.రామచంద్రారెడ్డి, కోట రవీందర్ రెడ్డి, గౌరవ కార్యదర్శి ఎన్.వంశీధర్, క్రీడల సమన్వ.