ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 7:49 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గ్రామపంచాయతీ తీర్మానాలను బేఖాతరు చేస్తున్న బెల్టు షాపులు,ఎక్సైజ్‌, పోలీసు శాఖలు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆరోపణ

గ్రామపంచాయతీ తీర్మానాలను బేఖాతరు చేస్తున్న బెల్టు షాపులు,ఎక్సైజ్‌, పోలీసు శాఖలు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆరోపణ,

అర్జున్ సమాచారం // సెప్టెంబర్ 30 // మంథని // రిపోర్టర్.

మండలంలోని పలు గ్రామపంచాయతీలు తమ గ్రామాల పరిధిలో బెల్టు షాపులు వద్దంటూ తీర్మానాలు చేసి అధికారులకు అందజేసినా, మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

మంథని మండలం ఎక్లాస్‌పూర్‌ గ్రామంలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. మద్యం వ్యాపారులతో సమావేశం నిర్వహించి, గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.20 వేల జరిమానా విధిస్తామని ప్రకటించినప్పటికీ విక్రయాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు.

మండలంలోని ఇప్పటివరకు ఎనిమిది గ్రామపంచాయతీలు బెల్టు షాపులకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసి అధికారులకు అందజేసినట్లు తెలిపారు. అయినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. గ్రామాల్లో మద్యం విక్రయాల వల్ల అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ఎక్సైజ్‌, పోలీసు శాఖల అధికారులు స్పందించి గ్రామపంచాయతీల తీర్మానాలను పరిగణనలోకి తీసుకుని, అక్రమ మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.