వాలీబాల్‌ పోటీలతో విద్యార్థుల్లో ఉత్సాహం.

వాలీబాల్‌ పోటీలతో విద్యార్థుల్లో ఉత్సాహం. అర్జున్ సమాచారం.జులై 13. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా: మంచిర్యాల: క్రీడలు విద్యార్థుల్లో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ,పట్టుదలను పెంపొందిస్తాయని మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ధరణి మధుకర్‌, టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి అన్నారు. గురువారం మంచిర్యాల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్‌ పోటీలను వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ మంచిర్యాల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ...