వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వడం కుదరదు ,కూరగాయలు, చిన్న సన్న ఆరుతడి పంటలు వేసుకోండి
సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాద్: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 24.
వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వడం కుదరదు. కూరగాయలు, చిన్న సన్న ఆరుతడి పంటలు వేసుకోండని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు సూచించారు.
శుక్రవారం నాడు టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రజాభవన్ లో కాంగ్రెస్ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఎల్‌నినో, ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసారు.
సీఎం మాట్లాడుతూ 50 శాతం బోర్లు డ్రై అయిపోయాయి. ఎండాకాలం వరినాట్లు నవంబర్ నుంచి ప్రారంభం అవుతాయి. చుక్క నీరు కూడా దొరకదని నేను అందుకే చెప్తున్నాను. శ్రీశైలంలో, కృష్ణా పరివాహక ప్రాంతంలో 20 శాతం నీళ్లు కూడా లేవు. 200 టీఎంసీల నీళ్లే ఉన్నాయి.. అందునా డెడ్ స్టోరేజ్ ఉంది. తాగునీరుకి వాడుకోవడం తప్ప మరే ఇతర అవసరాలకు నీళ్లు లేవు. 8 నుంచి 10 నెలల వరకు అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోబోతున్నాం. మనం ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నామని అన్నారు.