ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 7:44 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

వన్యప్రాణులను సంరక్షించుకోవాలి,అడవులు, జీవవైవిధ్యాన్ని కాపాడితేనే పర్యావరణ సమతుల్యతమంథని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం.వి. నాయక్

వన్యప్రాణులను సంరక్షించుకోవాలి,అడవులు, జీవవైవిధ్యాన్ని కాపాడితేనే పర్యావరణ సమతుల్యత
మంథని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం.వి. నాయక్.

అర్జున్ సమాచారం // అక్టోబర్ 5 // మంథని రిపోర్టర్.

వన్యప్రాణులను సంరక్షించుకోవాలని, అడవులు, జీవవైవిధ్యాన్ని కాపాడటం ద్వారా పర్యావరణ సమతుల్యతను పరిరక్షించవచ్చని మంథని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం.వి. నాయక్ అన్నారు.

వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా సోమవారం మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంథని రేంజ్ అటవీశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎం.వి. నాయక్ మాట్లాడుతూ యువతలో వన్యప్రాణుల పట్ల ప్రేమ, పరిరక్షణ భావాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు అడవులు, వన్యప్రాణులు, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతపై అవగాహన కల్పించారు. అనంతరం వన్యప్రాణుల సంరక్షణపై క్విజ్ నిర్వహించి, విద్యార్థులతో సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఓ పి. దేవదాస్, ఎఫ్‌ఎస్‌ఓలు మంగీలాల్, రవి, షా ఖాన్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి డా. లక్ష్మీనారాయణ, అధ్యాపకులు కృష్ణ, సతీష్, అమర్నాథ్, ముకుందం, ఫర్జానా, రామకృష్ణ, రజిత, దుర్గం కృష్ణ, శేఖర్, సందీప్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.