ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 7:07 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాంకాంగ్రెస్‌లో బీసీలకు ఒక న్యాయం.. రెడ్లకు మరో న్యాయమా? బీసీలను అణగదొక్కే రాజకీయ కుట్రలను సహించం:నరెడ్ల శ్రీనివాస్.

బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాంకాంగ్రెస్‌లో బీసీలకు ఒక న్యాయం.. రెడ్లకు మరో న్యాయమా? బీసీలను అణగదొక్కే రాజకీయ కుట్రలను సహించం:
నరెడ్ల శ్రీనివాస్.

మంచిర్యాల. అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 4.

బీసీ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ని ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు బాధ్యురాలిని చేస్తూ మంత్రి పదవి నుంచి తొలగించడాన్ని బీసీ సమాజ్ తీవ్రంగా ఖండిస్తోందని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ అన్నారు.

ఒక బీసీ మహిళా మంత్రిని మంత్రి పదవి నుంచి తొలగించే విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరును బీసీ సమాజ్ ప్రశ్నిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఒక విధానం, రెడ్డి సామాజిక వర్గానికి మరో విధానం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగా పార్టీని విమర్శించిన సందర్భాలు అనేకం ఉన్నప్పటికీ వారిపై ఇదే తరహాలో కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా విమర్శించిన అనేక సందర్భాలు ఉన్నప్పటికీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుల విషయంలో ఒక విధంగా, బీసీ నాయకుల విషయంలో మరో విధంగా వ్యవహరించడం ఏమిటని నిలదీశారు.

“బీసీ మహిళా మంత్రికి ఒక న్యాయం.. రెడ్డి నాయకులకు మరో న్యాయమా?”

కాంగ్రెస్ పార్టీలో రెడ్ల రాజ్యం నడుస్తోందని, బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని నరెడ్ల శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు.

బీసీలకు రాజకీయంగా ఎదిగే అవకాశం వచ్చిన ప్రతిసారీ వారిని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ ధోరణిని బీసీ సమాజ్ ఎంతమాత్రం సహించబోదని స్పష్టం చేశారు.

“బీసీలను ఓట్ల కోసం ఉపయోగించుకుని, అధికారం విషయంలో మాత్రం అణగదొక్కే రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ విడనాడాలి. బీసీలపై వివక్షకు స్వస్తి పలకాలి. అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా తెలంగాణలోని బీసీ మంత్రులు, బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులు కళ్లుతెరిచి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనించాలని నరెడ్ల శ్రీనివాస్ సూచించారు.

బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ రాజకీయ నిర్ణయాన్నైనా బీసీ సమాజ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, బీసీలకు న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

“బీసీలను అణగదొక్కే రాజకీయాలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారు. బీసీల రాజకీయ చైతన్యం ఇక ఆగదు.”
ఈ కార్యక్రమంలో
బీసీ సమాజ్ జిల్లా ఉపాధ్యక్షులు వైద్య భాస్కర్. బొలిశెట్టి లక్ష్మణ్. జిల్లా నాయకులు బియ్యాల సత్తయ్య. జక్కం రవీందర్. బీసీ సమాజ్ పట్టణ నాయకులు వెన్నంపల్లి మురళి. గుండ్ల లక్ష్మణ్. ఎండి షఫీ. కొడుకా మోహన్. పల్లపు శ్రీను తదితరులు పాల్గొన్నారు