చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం ఎప్పుడు?అత్యవసర వైద్య పరికరాలు అందుబాటులోకి తేవాలి — ప్రజల ప్రాణాలు కాపాడాలి
చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం ఎప్పుడు?అత్యవసర వైద్య పరికరాలు అందుబాటులోకి తేవాలి — ప్రజల ప్రాణాలు కాపాడాలి అర్జున్ సమాచారం జులై 12 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి: చెన్నూరు, ఆగస్టు 12: చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం, ఐఎఫ్‌టీయూ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సరైన సమయంలో వైద్యం అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.చెన్నూరు గాంధీ చౌక్‌లో పాన్...