మంథని పశువైద్యశాలలో సమయపాలన ఏదీ?
మంథని పశువైద్యశాలలో సమయపాలన ఏదీ? మధ్యాహ్నానికే వైద్య సేవలు నిలిచిపోతున్నాయంటూ రైతుల ఆవేదన పశువులకు మందులు, చికిత్స అందడం లేదని ఆరోపణలు.. ఉన్నతాధికారులు స్పందించాలని విజ్ఞప్తి అర్జున్ సమాచారం // అక్టోబర్ 14 // మంథని డెస్క్: మంథని ప్రభుత్వ పశువైద్యశాల పనితీరుపై పశువుల పెంపకందారుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రిలో సమయపాలన కొరవడుతోందని, మధ్యాహ్నం ఒంటిగంట లేదా రెండు గంటలకే సిబ్బంది ఆసుపత్రిని మూసివేసి వెళ్లిపోతున్నారంటూ స్థానికులు, రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో పశువులకు...