ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 10:11 am Posted by : ARJUN SAMAACHAARAM DESK

చైనాను మించిపోతుందా…

చైనాను మించిపోతుందా…

విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 26.

ఆసియాలో చైనా, భారత్ మధ్య ఉన్న అంతరం గత ఎనిమిదేళ్లతో పోల్చితే తగ్గింది. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని సుస్థిరతం చేసుకుంది. ఈ విషయాలను లోవీ సంస్థ తాజాగా విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ 2026లో పేర్కొంది. ఇక, అమెరికా, చైనాల మధ్య కూడా అంతరం భారీగా తగ్గిందని నివేదిక వెల్లడించింది. అగ్రరాజ్యం ఆర్థికంగా, సైనిక పరంగా ప్రస్తుతం దాని శక్తి సన్నగిల్లిందని.. చైనా మాత్రం స్థిరంగా ఉందని పేర్కొంది.ఆసియాలోనే మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుందని లోవీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ 2026 పేర్కొంది. ఇందుకు బలమైన ఆర్థిక అంచనాలు, దౌత్య ప్రభావం, సమర్థవంతమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం కారణమని పేర్కొంది. అలాగే, చైనా అధినేత షీ జిన్‌పింగ్ తర్వాత ఆసియాలోనే రెండో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా భారత ప్రధాని నిలిచారని పేర్కొంది. భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాదు.. 2018లో ఆసియా పవర్ ఇండెక్స్ ప్రారంభించినప్పటి నుంచి చైనాతో ఉన్న అంతరాన్ని అత్యంత తక్కువ స్థాయికి తగ్గించుకుంది. అయినప్పటికీ భారత్ కంటే చైనా 80 శాతం ఎక్కువగా ఉందని నివేదిక వివరించింది.నివేదిక రూపకల్పనకు లోవీ ఇన్‌స్టిట్యూట్ ప్రామాణికంగా తీసుకున్న ఎనిమిదింటిలో ఐదు విభాగాల్లో భారత్ వృద్ధి సాధించింది. మిగతా మూడింటిలో స్వల్ప తగ్గుదల నమోదుచేసింది. అయినాసరే దౌత్య ప్రభావం మాత్రం అత్యంత స్థిరమైన కొలమానంగా నిలిచింది. అనేక దేశాలు ఈ విభాగంలో క్షీణతను ఎదుర్కొంటే.. భారత్ మాత్రం నిలకడగా ఉందని నివేదిక వివరించింది.భారత రక్షణ వ్యవస్థలు, సాంస్కృతిక ప్రభావం ఆసియాలో దాని పరపతిని పెంచాయని నివేదిక తెలిపింది. రక్షణ ఒప్పందాలు, ఆగ్నేయాసియా దేశాలకు బ్రహ్మోస్ క్షిపణుల విక్రయాలు భారత్‌ను తొమ్మిదో స్థానానికి చేర్చాయని పేర్కొంది. ‘‘సాంస్కృతిక ప్రచారం, సమాచార వ్యాప్తి, ప్రజల మధ్య రాకపోకలు అనే మూడు అంశాలలో మెరుగుదల కారణంగా భారత్ సాంస్కృతిక ప్రభావం 43.8 పాయింట్లకు పెరిగింది’’ అని లోవీ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.భారత్ తన ప్రభావాన్ని పెంచుకుందని, 2018 తర్వాత చైనాతో అంతరాన్ని తగ్గించుకుందని లోవీ ఇన్‌స్టిట్యూట్ ఆగ్నేయాసియా ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ హంటర్ మార్స్టన్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.మరోవైపు, రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ ద్రవ్య నిధి  నిబంధనల్లో మార్పు, విదేశాలకు వెళ్లే పెట్టుబడులలో దాదాపు 20 బిలియన్ డాలర్ల తగ్గుదల వంటి కొన్ని ప్రతికూల అంశాలను కూడా ఉన్నాయని నివేదిక పేర్కొంది.ప్రధాని మోదీ విషయానికి వస్తే.. గల్ఫ్ వివాద సమయంలో భారత్ అనుసరించిన వైఖరితో ఆయన నాయకత్వం, వ్యూహాత్మక ఆశయాలపై నమ్మకాలు కొంత తగ్గాయని నివేదిక పేర్కొంది. ఏదేమైనప్పటికీ ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్‌కు ఉన్న అవకాశాల పరిధి చాలా ఎక్కువగా ఉందని అభిప్రాయపడింది.ఆసియా పవర్ ఇండెక్స్ 2026లో ఆర్థిక, సైనిక సామర్థ్యం, దౌత్యపరమైన ప్రభావం, భవిష్యత్తు వనరులు, రక్షణ నెట్‌వర్క్‌లు, ఆర్థిక సంబంధాలు వంటి ఎనిమిది అంశాల్లో 131 సూచికల ఆధారంగా 27 దేశాల పరిస్థితులను అంచనా వేసింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా వ్యవహారాల్లో నిమగ్నం కావడంతో ఆసియాపై అమెరికా దృష్టి మళ్లించింది. దీనిని ఆసరాగా చేసుకుని బీజింగ్ ఇప్పుడు సైనిక శక్తి పరంగా వాషింగ్టన్‌కు అత్యంత చేరువలోకి వచ్చింది. ఈ అంతరం ఇంకా తగ్గుతూనే ఉంది. పవర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం.. అమెరికా (78.9), చైనా (73.6) మధ్య అంతరం 5.3 పాయింట్లుగా ఉంది. ఆర్థిక, సైనిక సామర్థ్యం, రక్షణ వ్యవస్థలు, దౌత్యపరమైన ప్రభావం వంటి విభాగాల్లో అమెరికా శక్తి క్షీణిస్తే.. చైనా మాత్రం బలంగా, స్థిరంగా ఉంది.సైన్యాన్ని ఆధునీకరించడంతో పాటు, చైనా తన నౌకాదళ శక్తిని నిరంతరం విస్తరిస్తోంది. ఈ సామర్థ్యాలు ఫిలిప్పీన్, తైవాన్‌లపై చైనా ప్రాదేశిక వాదనలకు బలాన్నిస్తున్నాయి. అమెరికా డాలర్ నిల్వలు బలంగా ఉన్నప్పటికీ, చైనా ఆర్థికంగా ఎదుగుతూనే ఉంది. చైనా అధికారిక నిల్వలు అమెరికా కంటే మూడు రెట్లు అధికంగా ఉన్నాయి. మరో వైపు మన దేశంతో శతాబ్దాలుగా అత్యంత సాంస్కృతిక, చారిత్రిక బంధం ఉన్న పొరుగు దేశం నేపాలే. ఇరు దేశాల ప్రజల మధ్య రోటీ, భేటీ సంబంధ బాంధ్యవ్యాలు ఉన్నాయి భారత్‌తో తెరచి ఉండే సరిహద్దులను పంచుకునే నేపాల్‌కు ఎలాంటి కష్టమొచ్చినా తక్షణం ఆదుకోవాల్సింది మన దేశమే.. ఇరు దేశాల మధ్య భద్రత, వాణిజ్యం, ఇంధనం, రవాణా, పెట్టుబడుల పరంగా ఇరుపక్షాల బాంధవ్యం కొనసాగుతున్నాయి. నేపాల్‌ ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, విపత్తు నిర్వహణ, నిత్యావసరాల సరఫరాలో భారత్ పాత్ర మరువలేనిది. కానీ కొన్నేళ్లుగా అక్కడి నాయకులు భారత్‌ను అనుమానంగానే చూస్తున్నారు. నేపాల్ రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం భారత వ్యతిరేకతను నూరిపోస్తున్నాయి. అయితే కష్టకాలంలో ఆదుకుంటున్న భారత్‌ను వారు వదులుకోలేని పరిస్థితులు సుస్పష్టం.. ఈ ఏడాది 2026 మార్చిలో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలేంద్ర షా భారత్‌ను తన తొలి ద్వైపాక్షిక పర్యటన గమ్యస్థానంగా ఎంచుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జరిగిన నేపాల్ ప్రధాని బాలేంద్ర షా 34 మంది అధికారుల బృందం, 52 మంది వ్యాపార ప్రతినిధులతో కలిసి రెండు రోజుల పర్యటన కోసం న్యూఢిల్లీకి వచ్చారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలపేతమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగింది. హైదరాబాద్‌ హౌజ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, బాలేంద్ర షాలమధ్య జరిగిన సమావేశంలో ఎనిమిది అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు అంతరిక్ష సాంకేతికత, భద్రతా శిక్షణ, పౌర సేవల సామర్థ్య పెంపు, ఆరోగ్యం, సంప్రదాయ వైద్యం, పట్టణాభివృద్ధి, వ్యవసాయం వంటి రంగాల్లో సహకారానికి ఈ ఒప్పందాలు మార్గం సుగమం చేయనున్నాయి. ఇటీవల నేపాల్‌లో మెరుపు వరదల కారణంగా దారుణంగా దెబ్బతిన్న ప్రాంతాల పునర్మిర్మాణం కోసం ప్రధాని మోదీ భారత్ తరపున 24 వేల రూపాయల నేపాలీ రూపాయల విలువైన ప్యాకేజీని ప్రకటించారు. ఈ సందర్భంగా భారత్‌ సాయంతో నేపాల్‌లో పూర్తిచేసుకున్న రెండు ఇంధన ప్రాజెక్టులను మోదీ, బాలెన్ షా వర్చువల్‌గా ప్రారంభించారు. 669 మెగావాట్ల సామర్థ్యమున్న అరుణ్‌ హైడ్రో–ఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్‌ ఇందులో ఉంది. మరో మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.