ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 6:07 am Posted by : ARJUN SAMAACHAARAM DESK

దుర్గమ్మ ఆశీస్సులతో ,నూతన ఓపెన్‌కాస్ట్ గనులు త్వరగా ప్రారంభం కావాలి.

దుర్గమ్మ ఆశీస్సులతో ,నూతన ఓపెన్‌కాస్ట్ గనులు త్వరగా ప్రారంభం కావాలి.

బెల్లంపల్లి ఏరియా అభివృద్ధి చెందాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు.ఏరియా పనులశాలలో అన్నదాన కార్యక్రమం..ముఖ్య అతిథిగా జనరల్ మేనేజర్ రమేష్,

తాండూర్; అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 17.

దుర్గా నవరాత్రుల సందర్భంగా బెల్లంపల్లి ఏరియా పనులశాలలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెల్లంపల్లి ఏరియాలో నూతనంగా ఏర్పాటు కానున్న ఓపెన్‌కాస్ట్ గనులు త్వరగా ప్రారంభమై, ఏరియా మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ ఏరియా ఉపాధ్యక్షులు పేరం శ్రీనివాస్, ఏఐటీయూసీ శాఖ కార్యదర్శి ఎస్. తిరుపతి, ఐఎన్‌టీయూసీ ఏరియా కార్యదర్శి బూర శ్రీనివాస్, పనులశాల కార్యదర్శి కందుల తిరుపతి, జనరల్ మేనేజర్ కార్యాలయ పిట్ కార్యదర్శి కే. భీమేష్, నాయకులు సత్యనారాయణ, పోశం, రాజేష్, ఏఐటీయూసీ నాయకులు కోడెం అశోక్, ఏఐటీయూసీ శాఖ ఉపాధ్యక్షులు బయ్య మొగిలి పాల్గొన్నారు.అలాగే పనులశాల అధికారి జ్ఞానేశ్వర్, నరేష్, ఏరియా ఇంజనీర్ వీరన్న, కైరిగూడ ప్రాజెక్టు అధికారి ఎం. నరేందర్, నిర్వాహకులు శంకర్, ఏరియా సర్వే అధికారి వినోద్ కుమార్‌తో పాటు జనరల్ మేనేజర్ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏరియా నాయకులు, అధికారులను మర్యాదపూర్వకంగా సన్మానించారు. దుర్గా నవరాత్రుల వేడుకల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అధికారులు, కార్మికులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.