ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 6:57 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రాజాపూర్‌లో శ్రీధర్‌బాబును అడ్డుకునేందుకు మహిళల ప్రయత్నం,రాజాపూర్‌లో శ్రీధర్‌బాబును అడ్డుకునేందుకు మహిళల ప్రయత్నం, గ్రామ సమస్యలు పరిష్కరించాలని మహిళల నిరసన,

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 19: మంథని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో పలువురు మంత్రుల పర్యటన సందర్భంగా
రామగిరి మండలం రాజాపూర్ గ్రామం వద్ద మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ను కొంతమంది మహిళలు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామంలో నెలకొన్న సింగరేణి సమస్యలపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగినట్లు తెలిసింది. మంత్రి పర్యటన సందర్భంగా మహిళలు నిరసన వ్యక్తం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా గ్రామ యువకులు మహిళలకు నచ్చజెప్పి శాంతియుతంగా అక్కడి నుంచి పంపించినట్లు సమాచారం. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన నేపథ్యంలో ఏసీపీ మడత రమేష్, మంథని సీఐ బుద్ధ స్వామి, రామగిరి ఎస్సై తాడవేన శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామ సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాజాపూర్ గ్రామస్థులు కోరుతున్నారు.