ప్రేమ వేధింపులతో యువతి ఆత్మహత్య

ప్రేమ వేధింపులతో యువతి ఆత్మహత్య. పరిగి: అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 10. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రావులపల్లి గ్రామంలో దారుణం జరిగగింది.  ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు ఎక్కువ కావడంతో బాలిక ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు గ్రామశివారులోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చరణ్ అనే యువకుడు ప్రేమించాలని పదే పదే ఫోన్ చేసి  ఒత్తిడి చేసాడు. పోలీసులు బాలిక మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ  ఆసుపత్రికి తరలించారు.