వోట్ జీరో.. ఫండ్స్ హీరో.
విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 9.
దేశంలో ఉన్న 2,074 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీల ఆర్థిక లెక్కలపై ఆ రిపోర్ట్. చదివాక ఒకటే ఫీలింగ్ వస్తుంది. ఇది పార్టీల జాబితా కాదు, ఘోస్ట్‌ల జాబితా.
రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అంటే ఎన్నికల సంఘం దగ్గర పేరు నమోదు చేసుకున్న పార్టీ. కానీ రాష్ట్ర పార్టీ హోదా గానీ, జాతీయ పార్టీ హోదా గానీ రాలేదు. ఓట్ల శాతం సరిపోక, సీట్లు రాక, లేదా రిజిస్టర్ అయ్యాక అసలు ఎన్నికల్లోనే దిగక. వీటికి సొంత గుర్తు ఉండదు. ఫ్రీ సింబల్స్ లిస్ట్‌లోంచి ఎంచుకోవాలి. ఉచిత ఓటర్ల జాబితా కాపీలు ఉండవు. దూరదర్శన్‌లో ఫ్రీ టైమ్ ఉండదు. పార్టీ ఆఫీస్‌కి సబ్సిడీ భూమి ఉండదు. ఇన్ని లేకపోయినా ఒక పవర్ఫుల్ బెనిఫిట్ మాత్రం ఉంది. ఆదాయపు పన్ను మినహాయింపు. కండిషన్స్ చాలా చిన్నవి. ఇన్కమ్ టాక్స్ రిటర్న్ వేయాలి, రూ20,000 దాటిన విరాళాల వివరాలు ఏటా ఎన్నికల సంఘానికి ఇవ్వాలి. అంతే. ఇంకా ట్విస్ట్ ఏంటంటే, రూ20,000 దాటిన విరాళమే రాలేదని చెప్పినా మినహాయింపు పోదు. ఒకసారి రిజిస్టర్ అయ్యావంటే ఆ కవచం నీ దగ్గరే ఉంటుందిభారత ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన తాజా విరాళాల నివేదికల ప్రకారం జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరమైన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రూ. 20,000 అంతకంటే ఎక్కువ మొత్తం ఉన్న విరాళాల సేకరణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడిపోయింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పొందిన రూ. 517.39 కోట్ల విరాళాలను పొందిన కాంగ్రెస్ 2025-26 నాటికి ఈ విరాళాల మొత్తం ఏకంగా 75 శాతం పడిపోయి రూ. 130.69 కోట్లకు పరిమితమైంది.దశాబ్ద కాలంలో కాంగ్రెస్ పార్టీ పొందిన విరాళాల్లో ఇది అతి తక్కువ.కాంగ్రెస్‌కు విరాళాలు ఇంత దారుణంగా పడిపోవడానికి ప్రధాన కారణం ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి వచ్చిన నిధులు గణనీయంగా తగ్గడమే. గతంలో ఈ ట్రస్ట్ నుంచి కాంగ్రెస్‌కు రూ. 216.34 కోట్ల వరకు విరాళాలు రాగా, ఈసారి అవి దాదాపు 88 శాతం పడిపోయి కేవలం రూ. 25 కోట్లకు చేరుకున్నాయి. 2025-26 నివేదికలోకాంగ్రెస్ పార్టీకి లభించిన ప్రధాన విరాళాల్లో స్టార్ సిమెంట్స్ రూ. 5 కోట్లు , సజ్జన్ భజంకా రూ. 4 కోట్లు , ప్రేమ్ కుమార్ భజంకా రూ. 2 కోట్లు ప్రముఖంగా ఉన్నాయి.అంతకు మించిఎవరూ విరాళాలివ్వడం లేదు.అధికార భారతీయ జనతా పార్టీ తో పోలిస్తే కాంగ్రెస్ ఆదాయం చానా దూరంలో ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బీజేపీ ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదిక ప్రకారం.. రూ. 20,000 కంటే ఎక్కువ ఉన్న విరాళాల రూపంలో ఆ పార్టీ ఏకంగా రూ. 6,074.02 కోట్లను రాబట్టింది. ఇది కాంగ్రెస్ పార్టీ సేకరించిన విరాళాల మొత్తానికి దాదాపు 12 రెట్లు . బిజెపికి చెందిన 2025-26 విరాళాల నివేదిక ఇంకా ఇసిఐ వెబ్సైట్లో విడుదల కావాల్సి ఉంది.అయితే, ఈ రూ. 20 వేల పైబడిన విరాళాల వివరాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆదాయాన్ని ప్రతిబింబించవు. చిన్న మొత్తాల విరాళాలు , సభ్యత్వ రుసుములు, కూపన్ల విక్రయం, బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీల ద్వారా కాంగ్రెస్ అదనపు ఆదాయాన్ని పొందుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో కూపన్ నిధుల సేకరణ ద్వారానే కాంగ్రెస్‌కు రూ. 350 కోట్లకు పైగా సమకూరాయి. ఈసిఐ ద్వారా పూర్తి ఆడిట్ ఖాతాల నివేదిక వెలువడిన తర్వాతే రెండు ప్రధాన జాతీయ పార్టీల సమగ్ర ఆర్థిక స్థితిగతులపై పూర్తి స్పష్టత రానుంది. తెలంగాణలో 104 ఉన్నాయి. వాటిలో 78 పార్టీల ఆడిట్ రిపోర్ట్, విరాళాల రిపోర్ట్, రెండూ సీఈవో వెబ్సైట్లో లేవు. ప్రతి నాలుగు పార్టీల్లో మూడు. ఆంధ్రప్రదేశ్‌లో 65 పార్టీలు ఉంటే 45 పార్టీలకు ఒక్క పేపర్ కూడా లేదు. రెండు రాష్ట్రాలనూ కలిపితే 169 పార్టీల్లో 123 ఘోస్ట్‌లు. అంటే 72.8%. రెండు రిపోర్టులూ పక్కాగా పెట్టిన పార్టీలు తెలంగాణలో 17, ఏపీలో 14. దేశ సగటు 22.2% ఉంటే తెలంగాణ 16.3% దగ్గర ఆగిపోయింది. ఏపీ 21.5%. దేశం మొత్తం చూస్తే 2,074లో 1,330 పార్టీల లెక్కలు పబ్లిక్‌కి కనిపించవు, దాదాపు 64%. యూపీలో 530 పార్టీల్లో 304 పార్టీలది ఇదే కథ. ఉత్తరాఖండ్‌లో 26 పార్టీల్లో ఒక్కదానిది కూడా లేదు, జీరో. పుదుచ్చేరి, సిక్కిం, త్రిపుర, చండీగఢ్ కూడా అంతే.
తెలంగాణలో లెక్కలు చెప్పిన 26 పార్టీల మొత్తం ఆదాయం కలిపి రూ18.98 లక్షలు. ఏపీలో 20 పార్టీల ఆదాయం రూ 70.8 లక్షలు. అదే ఏడాది గుజరాత్‌లోని 29 పార్టీలు రూ510 కోట్లు చూపించాయి. రూ1 కోటి దాటి ఆదాయం చూపిన 49 పార్టీల టాప్ లిస్ట్‌లో తెలంగాణ, ఏపీ పార్టీలు ఒక్కటి కూడా లేవు. కాబట్టి మన దగ్గర సమస్య భారీ మొత్తాలు కాదు. లెక్కలే లేకపోవడం. రిపోర్ట్ మన పార్టీలను ఏ తప్పూ చేశాయని అనలేదు, వెరిఫై చేయడానికి సమాచారమే లేదని మాత్రమే చెప్పింది. ఇక్కడ లెక్కలు ఇంకా విచిత్రంగా ఉన్నాయి. ఒక పార్టీ నాకు మొత్తం రూ100 విరాళంగా వచ్చింది అని చెప్పి, అందులో రూ200 పెద్ద విరాళాలు అని చూపిస్తే మ్యాథ్స్ కూడా ఏడుస్తుంది. రిపోర్ట్‌లో ఇలాంటి 14 పార్టీలు ఉన్నాయి. అందులో రెండు తెలంగాణవి.
మజ్లిస్ బచావో తహ్రీక్ ఆదాయం 0, మొత్తం విరాళాలు 0. కానీ కాంట్రిబ్యూషన్ రిపోర్ట్‌లో రూ1.29 లక్షల పెద్ద విరాళాలు ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 7 సీట్లలో పోటీ చేసి 49,423 ఓట్లు తెచ్చుకుంది. విశ్వ భారత్ పార్టీ ఆదాయం రూ900, మొత్తం విరాళాలు రూ200, పెద్ద విరాళాలు రూ 30,000. ఒక సీటులో పోటీ చేస్తే వచ్చిన ఓట్లు 55. యాభై ఐదు. ఇది టైపో కాదు.తెలంగాణ మొత్తం చూసినా అదే సీన్. రూ20,000 పైబడిన విరాళాలు రూ 84.8 లక్షలు, మొత్తం విరాళాలు రూ12.67 లక్షలు. ఏపీలో రూ 1.07 కోట్లు వర్సెస్ రూ 70.1 లక్షలు. పైగా ఖర్చు రూ 78.2 లక్షలు, ఆదాయం రూ70.8 లక్షలే. అంటే ఆడిట్ ఫైల్ ఒక కథ చెప్తోంది, కాంట్రిబ్యూషన్ రిపోర్ట్ మరో కథ చెప్తోంది. ఈ రెండు ఫైళ్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోలేదు.
సరే, తెలుగు రాష్ట్రాలు చిన్న లెవల్. అసలు సినిమా గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్‌లో ఉంది..జన్ సురాజ్ పార్టీ FY 2024-25లో రూ101 కోట్ల ఆదాయం చూపింది. ఖర్చు రూ9.2 కోట్లు మాత్రమే. బిహార్ 2025లో 238 సీట్లలో పోటీ చేసి 16,77,583 ఓట్లు తెచ్చుకుంది. కానీ గెలిచిన సీట్లు జీరో. తర్వాత 2026లో బాంకీపూర్ ఉపఎన్నికలో 64,151 ఓట్లతో ఒక సీటు గెలిచింది. ఆ పార్టీ విరాళాల్లో వేదాస్ వెంచర్స్ ఒక్కటే రూ85 కోట్లు 85 లావాదేవీల్లో ఇచ్చింది. ప్రశాంత్ కిషోర్ రూ10 కోట్లు 10 విరాళాల్లో ఇచ్చారని రిపోర్ట్ చెప్పింది. డబ్బు ఉంది, పోటీ ఉంది, ఓట్లు ఉన్నాయి, గ్రౌండ్ ఉంది. అక్కడ లెక్కలు పెట్టారు, ఫైల్ చేశారు, పబ్లిక్‌కి కనిపిస్తున్నాయి.
ఇక తమిళగ వెట్రి కళగం సెప్టెంబర్ 2024లో రిజిస్టర్. FY 2024-25లో డిక్లేర్ చేసిన ఆదాయం రూ7.57 లక్షలు. ఆ తర్వాత తమిళనాడు 2026 ఎన్నికల్లో 233 సీట్లలో పోటీ చేసి 1.72 కోట్ల ఓట్లు తెచ్చుకుంది. తమిళనాడులో 108, పుదుచ్చేరిలో 2, మొత్తం 110 సీట్లు. అంటే రూ7.57 లక్షలతో 110 సీట్లు. పక్కన న్యూ ఇండియా యునైటెడ్ పార్టీ రూ291 కోట్లతో 1,426 ఓట్లు. ఇప్పుడు చెప్పు, పొలిటికల్ పవర్ డబ్బుతో వస్తుందా, జనంతో వస్తుందా? పీఎంకే 4 సీట్లు, జన్సత్తా దళ్ లోక్తాంత్రిక్ 2 సీట్లు, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీ రామ్) 1 లోక్‌సభ సీటు గెలిచాయి. చిన్న పార్టీలు ఓట్లతో సీట్లుగా మారగలవని ఇవే ప్రూఫ్.
ఎన్నికల సంఘం బ్లైండ్ కాదు. 2025 ఆగస్టు 9న 334, సెప్టెంబర్ 18న 474, మొత్తం 808 పార్టీలు ఆరేళ్లు పోటీ చేయలేదని డీలిస్ట్ చేసింది. ఇంకో 359 పార్టీలపై ఆడిట్ ఖాతాలు ఇవ్వలేదని చర్యలు మొదలుపెట్టింది. 2022లో 537 పార్టీలను తొలగించింది. 2026 మార్చిలో రూల్ కూడా మార్చింది.