సంగారెడ్డి :అర్జున్ సమాచారం:
సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో విషాదం చోటుచేసుకుంది. సరాక రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. తెల్లవారుజామున పరిశ్రమలోని గ్లాబా బ్లాక్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో సుదర్శన్ రావు (27), బాలాజీ (44) అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్మికులుగా సమాచారం. సమాచారం అందుకున్న జిన్నారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్యాస్ లీక్‌కు గల కారణాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

