ePaper
Saturday, November 28, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్డీలిమిటేషన్‌తో తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 175కు పెరుగుతాయి: రాంచందర్ రావు

డీలిమిటేషన్‌తో తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 175కు పెరుగుతాయి: రాంచందర్ రావు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, నవంబర్28:అర్జున్ సమాచారం:
మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాల సాధన కోసం కృషి చేయాలని ప్రజలతోపాటు రాజకీయ పార్టీలకు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు పిలుపునిచ్చారు. వారి ఆశయాల
మేరకు మహిళలకు విద్యావకాశాలతో పాటు , వారికి రాజకీయ అభ్యున్నతి కూడా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. అయితే మహిళా రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం
కాదంటూనే అడ్డుకుంటున్నారంటూ ప్రతిపక్ష పార్టీల వైఖరిపై మండిపడ్డారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి
ఘటించిన.. ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం టీజీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు మాట్లాడుతూ.. జనాభా ఆధారంగా సీట్లు కేటాయిస్తే దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు కొంత అన్యాయం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కానీ మహిళా
రిజర్వేషన్లతోపాటు 543 సీట్లలో 50 శాతం పెంచితే ఎవరికి అన్యాయం జరగదని భావిస్తున్నానని అన్నారు. ఇలా అయితే ఎవరికి నష్టం జరగకుండా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు
175కు లోక్‌సభ స్థానాలు 25కు పెరుగుతాయని అంచనా వేస్తున్నామని రాంచందర్ రావు చెప్పారు. గతంలో రాజీవ్ గాంధీ మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి ఒప్పుకోలేదని గుర్తు చేశారు.
ఇండియా కూటమి నేతలు కూడా అందుకు అడ్డుపడ్డారని వివరించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత సీట్లు కూడా పెంచే అవకాశం ఉంటుందని అన్నారు. దేశంలో 140 కోట్ల
జనాభా ఇప్పుడు ఉందని.. 1991లో 54 కోట్ల జనాభాకు వారు గతంలో 543 సీట్లు కేటాయించారని సోదాహరణంగా వివరించారు. 2011 సెన్సెస్ అధారంగా సీట్లు పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ
బీజేపీ చీఫ్ రాంచందర్ రావు స్పష్టం చేశారు. సీట్ల పెంపుతో ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. వెనుకబడిన తరగతుల వారికి కూడా సీట్లు వస్తాయని చెప్పారు. సీట్లు పెంచడంతో
ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ , బీసీలకు సీట్లు వస్తాయని పేర్కొన్నారు. అయితే వారికి అన్యాయం జరగాలని.. వారు ఎంపీలు, ఎమ్మెల్యేలు కావద్దని కుట్రతో డీలిమిటేషన్ బిల్లును
వ్యతిరేకిస్తున్నారంటూ ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు నిప్పులు చెరిగారు. మూడు వంతుల జనాభా పెరిగితే చట్టసభల్లో సీట్లు పెరగాలా వద్దా? అని
రాంచందర్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు
న్యాయం జరిగితే ఒప్పుకునే పరిస్థితి లేదని ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. ఈ పార్లమెంట్ సెషన్స్ లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారు. దీని వల్ల అందరికీ న్యాయం జరుగుతుందని
ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బిల్లులు ఆమోదించడం ద్వారా అసమానతలు తొలగించి అందరిని సమానం చేయాలని టీజీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు పేర్కొన్నారు. సిస్టమేటి‌క్‌గా ఓట్లు డివైడ్ చేయాలనే ఈ
డీలిమిటేషన్ బిల్లు అని వివరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కొంత మందికి లబ్ది చేకూర్చేలా నియోజకవర్గ విభజన చేసిందని ఆరోపించారు. పార్లమెంట్ ప్రత్యేక సేషన్స్‌లో ప్రవేశపెట్ట బోయే డీలిమిటేషన్
బిల్లును స్వాగతిస్తున్నామని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు తెలిపారు.
=====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!