హైదరాబాద్, సెప్టెంబర్ 2,అర్జున్ సమాచారం:
తెలంగాణాకు చెందిన జి కిషన్ రెడ్డి సీనియర్ నాయకుడు. ఆయన విద్యార్థి రాజకీయాల నుంచి బీజేపీలో పనిచేశారు. ఏబీవీపీ నుంచి యువ మోర్చా దాకా అక్కడ నుంచి బీజేపీలో అంచెలంచెలుగా
ఎదుగుతూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉమ్మడి ఏపీలో పనిచేశారు. ఆయన ఎమ్మెల్యేగా అంబర్ పేట నుంచి మూడు సార్లు గెలిచారు. శాసన సభా పక్ష నాయకుడిగా కూడా వ్యవహరించారు. ఇక గత రెండు
పర్యాయాలుగా ఆయన ఎంపీగా గెలిచారు. సికింద్రాబాద్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రంలో మంత్రిగా ఏడేళ్ళుగా కొనసాగుతున్నారు. తెలంగాణా బీజేపీకి కూడా ఆయన 2023 ఎన్నికలకు
ముందు మరోసారి వ్యవహరించారు. ఇంతటి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న కిషన్ రెడ్డిని బీజేపీ పార్టీ వ్యవహారాలకు పూర్తిగా వాడుకుంటుంది అన్న ప్రచారం సాగుతోంది. బీజేపీ కీలక మార్పులు
చేయబోతోంది అని అంటున్నారు. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారం అందుకోవాలని బీజేపీ చూస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో చేపట్టబోయే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో బీజేపీ ప్రాతినిధ్యం ఈ రాష్ట్రంలో
రెట్టింపు చేయాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం రెండుగా ఉన్న కేంద్ర మంత్రి పదవులను నాలుగు చేయాలని బీజేపీ ఆలోచిస్తో అని అంటున్నారు. అంతే కాదు మహిళ బీసీ కోటాను కూడా అనుసరించి మరిద్దరికి
కేంద్ర మంత్రి పదవులు ఇస్తారని అంటున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు కేంద్ర మంత్రిగా చాన్స్ ఖాయమని అంటున్నారు. అలాగే మల్కాజ్ గిరీ ఎంపీ ఈటెల రాజేందర్ కి కేంద్ర మంత్రి పదవి
తధ్యమని అంటున్నారు. వీరిద్దరితో పాటు కొందరి సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. ఇక కేంద్ర మంత్రిగా సీనియర్ నేతగా ఉన్న కిషన్ రెడ్డిని బీజేపీ పార్లమెంటరీ
బోర్డులోకి తీసుకుంటారు అని అంటున్నారు. తెలంగాణా నుంచి దక్షిణాది నుంచి బీజేపీ ఫోకస్ పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. బీజేపీకి పార్లమెంటరీ బోర్డు చాలా కీలకం అని
చెబుతున్నారు. ఎవరికి ఎక్కడ టికెట్ ఇవ్వాలన్నా ఈ అత్యున్నత విధాయక మండలి నిర్ణయిస్తుంది. ప్రధాని సహా కీలక నేతలు అంతా ఉండే ఈ బోర్డులోకి కిషన్ రెడ్డిని తీసుకుంటారు అని అంటున్నారు.
దాని ద్వారా రానున్న కాలంలో తెలంగాణా రాజకీయాన్ని మరింత క్లోజ్ గా మోనిటరింగ్ చేస్తారు అని అంటున్నారు. 2028లో జరిగే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలి అన్నది కూడా ఇంకా బాగా అధ్యయనం
చేసేందుకు ఇది దోహదపడుతుందని అంటున్నారు. అలాగే సమర్థులకు పనిమంతులకు టికెట్ ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. అంతే కాదు బీజేపీలో ప్రముఖ
నేతలలో ఒకరికి గవర్నర్ చాన్స్ కూడా ఇస్తారని అంటున్నారు. దాని వల్ల ఈ ప్రాంతం మీద బీజేపీ మరింతగా శ్రద్ధ చూపిస్తోంది అన్న సందేశం ఇవ్వాలని అనుకుంటోంది. ఇక రానున్న కాలంలో రాజ్యసభ
సీటు వంటి పదవులు కూడా తెలంగాణాకు దక్కవచ్చు అని అంటున్నారు. మొత్తం మీద జాతీయ కార్యవర్గంలో చోటు లేదని భావించే చోట తెలంగాణా నుంచి కిషన్ రెడ్డిని పార్లమెంటరీ బోర్డులోకి
తీసుకుంటారు అన్న ప్రచారం సాగుతోంది.
====================

