అర్జున్ సమాచారం , హైదరాబాద్ : స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో
అకడమిక్ డైరక్టర్ డా బి ఇ వి ఎల్ ఎన్ నాయుడు అద్యక్షతన విద్యార్థులకు ” ఏమి తినాలి, ఎలా తినాలి ” అనే ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
హైదరాబాద్ యశోద ఆసుపత్రి నుంచి వచ్చిన
గేష్ట్రోఎంట్రాలజిష్ట్
డా వై శ్రీమన్నారాయణ మాట్లాడుతూ
“మన జీవన విధానంలో “ఏమి తినాలి” అనే విషయంతో పాటు “ఎలా తినాలి” అనేది కూడా చాలా ముఖ్యమని ,
మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందాలంటే దంపుడు బియ్యం, జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు వంటి పీచుపదార్థాలు ఎక్కువ ఉన్నవి ఎంచుకోవాలి,
సీజన్‌ను బట్టి దొరికే తాజా కూరగాయలు, ఆకుకూరలు రోజూ భోజనంలో భాగం కావాలని, శరీర పుష్టికి కందిపప్పు, పెసరపప్పు, శనగలు, మినుములు లేదా మొలకెత్తిన గింజలు తీసుకోవాలని,
రోజుకు కనీసం ఒక తాజా పండైనా (జామ, ఆపిల్, బొప్పాయి, అరటి వంటివి) తినడం మంచిదని, పాలు, పెరుగు లేదా మజ్జిగ, నెయ్యి మరియు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని,
మైదా, వైట్ షుగర్ వంటివి శరీరానికి ఎలాంటి పోషకాలను ఇవ్వవు, పైగా బరువును, షుగర్‌ను పెంచుతాయని,
చిప్స్, ప్యాకెట్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్.నూనెలో బాగా వేయించిన కూరలు, జంక్ ఫుడ్‌ను మానేయాలని,
వంటల్లో ఉప్పు, కారం, నూనెలను పరిమితంగా వాడటం మరియు రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని , ఎల్లప్పుడూ ఇంట్లో వండిన తాజా ఆహారానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
దంత వైద్యులు డా అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ
“భోజనం చేసేటప్పుడు టీవీలు, మొబైల్స్ చూడటం లేదా కోపంగా, ఆందోళనగా ఉండటం మంచిది కాదని , ఆహారంపైనే దృష్టి పెట్టి తినాలని, నోట్లోనే ఆహారం లాలాజలంతో బాగా కలవాలని ,ఇది జీర్ణక్రియను 50% సులభతరం చేస్తుందని, సుఖాసనంలో కూర్చుని తినడం చాలా మంచిదని, . దీనివల్ల జీర్ణాశయానికి రక్తప్రసరణ బాగా జరుగుతుందని, కడుపులో
సగం వంతు ఆహారానికి, పావు వంతు నీటికి, మిగతా పావు వంతు గాలి ఆడేలా ఖాళీగా ఉంచాలని, ప్రతిరోజూ ఒకే సమయానికి తినడం అలవాటు చేసుకోవాలని , రాత్రి భోజనం పడుకోవడానికి కనీసం 2 గంటల ముందే ముగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదిత్య ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ తేజేశ్వరరావు, శివ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని, జీవన విధానాన్ని నిర్ణయిస్తుంది.. డా అడ్డాల, డా శ్రీమన్నారాయణ
RELATED ARTICLES

