ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeసినిమా‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్...

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్ ‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది : చిత్ర దర్శకుడు యుద్ధనపూడి మైకిల్ ‘మా రాముడు అందరివాడు ’ చిత్ర విజయంపై నమ్మకంగా ఉన్నాం : నిర్మాత, విలన్ లక్ష్మణరావు

📰 Generate e-Paper Clip

అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు,  పల్లకొండ శ్రీరాములు  నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’.  యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించారు.  సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్  కీలక పాత్రల్లో నటించారు. ఆనంద భారతి,  గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి ఇతర పాత్రలు పోషించారు.  సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా   హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ ఈ చిత్రం ఘన విజయం సాధించి మూవీ టీమ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు.

ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ ..‘‘సినీ ఇండస్ట్రీలో గ్లామర్  కంటే టాలెంట్ ముఖ్యమని ఇప్పటికే చాలామంది నిరూపించారు. ఈ సినిమా హీరో  శ్రీరామ్‌లో కూడా మంచి టాలెంట్ ఉంది. డ్యూయెల్ రోల్‌లో ఆయన పెర్ఫార్మెన్స్  బాగా చేశారు.  ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యమంత్రిగా మంచి మెసేజ్ ఇచ్చే పాత్రలో కనిపిస్తాను.  దర్శకుడు మైకిల్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నిర్మాత లక్ష్మణ్ గారు ఇందులో  విలన్‌గా కూడా నటించారు. ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇది చాలా మంచి కథ.  ట్విస్టులు ఇంటరెస్టింగ్‌గా ఉంటాయి. కచ్చితంగా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరింతమంది కొత్త నటీనటులు, కొత్త నిర్మాతలు  ఇండస్ట్రీకి వస్తారు”అని అన్నారు.

నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ..‘‘మా సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తూనే, ఇందులో విలన్‌ పాత్ర పోషించా. ఫస్టాఫ్‌లో వైల్డ్ విలన్‌గా కనిపిస్తా. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసి అరాచకంగా ఆ ఊరిని ఎలా కంట్రోల్ పెట్టుకుంటాడనేది నా క్యారెక్టర్. సుమన్ గారు ఇందులో సీఎంగా నటించారు. మా మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ అలరిస్తాయి. మారెడుమిల్లి ఫారెస్ట్‌లో షూటింగ్ చేశాం. విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. మనీష్ కుమార్ మ్యూజిక్ అందించిన నాలుగు పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. డివోపీ వినోద్, కుమార్‌‌ సహా టీమ్ అంతా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దవారిని సపోర్ట్ చేయాలని  కోరాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత ట్రైలర్ చూసి వారే బాగుందని చెప్పారు.   200పైగా థియేటర్స్‌లో   సెప్టెంబర్ 4న  ప్రేక్షకులముందుకు రాబోతున్న మా  చిత్రాన్ని  ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నా”అని అన్నారు.

దర్శకుడు  యుద్ధనపూడి మైకిల్ మాట్లాడుతూ.. ‘‘దాదాపు పద్నాలుగు నెలలు ఈ సినిమాతో  జర్నీ చేశాం. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని అవన్నీ దాటుకుని  సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. శ్రీరామ్ గారు నా స్నేహితుడు. ఆయన సపోర్ట్‌తోనే ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. హీరోయిన్ స్వాతి కూడా  చాలా బాగా సహకరించారు. ఎలాంటి సదుపాయాలు లేకపోయినా ఆమె మాకు సహకరించారు. ఈ సినిమాకు డైరెక్షన్‌తో పాటు కథ, మాటలు, పాటలు, రెండు పాటలకు కొరియోగ్రఫీ అందించాను.  కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్లు ఇండస్ట్రీకి రావడం చాలా కష్టం. కానీ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. కష్టపడితే ప్రతి ఒక్కరికీ సక్సెస్ వస్తుందని నిరూపించాం. ఇది నాకు సక్సెస్‌మీట్‌లా ఫీలవుతున్నా.   పాజిటివ్ వైబ్‌ ఉండే టైటిల్, పాజిటివ్ వైబ్ ఉన్న కథ ఇది. ఇందులోని ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాతో   ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అందిస్తాం. సుమన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా”అని చెప్పారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ..‘‘చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని కాకుండా కంటెంట్ చూడాలి. తెలుగు వాళ్లం మనల్ని మనమే తొక్కేసుకుంటున్నాం. మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటేనే  మనం ప్రూవ్ చేసుకుంటాం. ఈ సినిమాలో చాలా దమ్ము ఉంది. ఇప్పటికీ నేను పదమూడు సినిమాలు చేశా. ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. సుమన్ గారితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాం.  మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. వంద సినిమాలు చేయాలనేది నా టార్గెట్”అని అన్నారు.
===========

Previous article
Next article
ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ పరిశీలించిన ఎంపీ ఈటల కూకట్‌పల్లి పరిధిలోని ఫతేనగర్ రైల్వే స్టేషన్‌ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన మెట్లను పరిశీలించిన ఆయన, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొద్దికాలం క్రితం ఇక్కడ ఉన్న రైల్వే స్టేషన్ మెట్లు కూలిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్ తన చొరవతో హుటాహుటిన నూతన మెట్ల నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన సమస్యలు మరియు స్థానికుల విజ్ఞప్తులు:
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!