ePaper
Sunday, November 1, 2026
ePaper
Homeజాతియంఢిల్లీసీఈసీపై ఇండియా కూటమి సమరం.. నేడు ‘జన మహాభియోగ్’

సీఈసీపై ఇండియా కూటమి సమరం.. నేడు ‘జన మహాభియోగ్’

📰 Generate e-Paper Clip

ఢిల్లీ, అక్టోబర్ 30:అర్జున్ సమాచారం:
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై ఇండియా కూటమి నేడు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది. ‘మాక్ పార్లమెంట్’గా తొలుత ప్రచారంలోకి వచ్చిన ఈ
కార్యక్రమానికి తాజాగా ‘జన మహాభియోగ్’ గా పేరు మార్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ, ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాలపై ప్రతిపక్ష నేతలు
చర్చించనున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సుమారు 13.5 కోట్ల మంది ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగించారనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఓటుహక్కు పరిరక్షణ,
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఎన్నికల సంఘం స్వతంత్రత వంటి అంశాలపై తమ అభిప్రాయాలను ఈ వేదిక ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని
రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంతో మొదలుపెట్టనున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముగింపు ప్రసంగం చేయనున్నారు. ఇండియా కూటమిలోని
19 రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వాదనలు వినిపించనున్నారు. ఒక్కో పార్టీ ప్రతినిధికి ఐదు నిమిషాల చొప్పున సమయం కేటాయించారు. మొత్తం 30 మంది
వక్తలు ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!