ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్వీబీజీ రామ్ జీ తో కేంద్రానికి పేరుస్తుందని కాంగ్రెస్ కు అక్కసు ...

వీబీజీ రామ్ జీ తో కేంద్రానికి పేరుస్తుందని కాంగ్రెస్ కు అక్కసు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

📰 Generate e-Paper Clip

కరీంనగర్,అర్జున్ సమాచారం:
కరీంనగర్ లో పలు అభివ్రుద్ది పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి.
వీబీజీ రామ్ జీ పథకం ద్వారా పేదలకు ఎంతగానో మేలు జరగడంతోపాటు గ్రామాల్లో ఆస్తుల స్రుష్టి జరగబోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ పథకాన్ని అమలు చేస్తే  కేంద్రానికి మంచి పేరుస్తుందని అక్కసుతోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమమన్నారు. ఈ స్కీం అమలు రాష్ట్రానికి భారం అన్పిస్తే ప్రధానమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లాలే తప్ప కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలనుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు, టీచర్లకు బ్రేక్ ఫాస్ట్, పాలు, లంచ్ సౌకర్యం కల్పించడాన్ని కేంద్ర మంత్రి స్వాగతించారు. ఒకవైపు బ్రేక్ పాస్ట్ సౌకర్యం కల్పిస్తూనే మరోవైపు రాష్ట్రంలో ఏకంగా 10 వేల స్కూళ్లను మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడమేంటని ప్రశ్నించారు. రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా పాఠశాలలను మూసివేయడం దుర్మార్గమన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో బాధ్యులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం వెనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ పిక్సింగ్ జరగడమే కారణమన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతోందని, చాపకింద నీరుగా బలపడుతుండటంతో ఓర్వలేకి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కుమ్కక్కై బిగ్ బాస్ షోను తలపించేలా డ్రామాలాడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు అవినీతి పార్టీలేనని, అందుకే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అందుకే తెలంగాణ ప్రజలు ఆ రెండు పార్టీలను ఎలిమినేషన్ చేసి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.
ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ కేఏపీపీ చంద్ర టింకు తో కలిసి కరీంనగర్ లోని 37వ డివిజన్ లో రూ.77 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. షాషామహల్ ప్రాంతంలో ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే:
కరీంనగర్ లోనా 37వ డివిజన్ లో రూ.77 లక్షల మన్సిపల్ సాధారణ నిధులతో సీసీ రోడ్లు, డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. 7వ డివిజన్ లో బీజేపీ గెలవదని చాలా మంది చెప్పారు. కానీ గెలిచి చూపించాం చంద్రను ఆశ్వీరించారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం సమస్యల్లేని డివిజన్ గా తీర్చిదిద్దుతా.  మరో వారం రోజుల్లో రూ.50 కోట్ల యూడీఎఫ్ నిధులతో కరీంనగర్ లో రోడ్ల నిర్మాణ పనులను కూడా ప్రారంభించబోతున్నాం.
================================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!