నిర్మల్,అర్జున్ సమాచారం:
ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను వేగంగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, విద్యార్థుల సంక్షేమం, అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, కులాంతర వివాహాల ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇండ్లు, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అమలుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్త్రం నీలాదేవి, రాంబాబు నాయక్, ప్రవీణ్, లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయికిరణ్, డీఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, డీఎస్పీ శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
======================
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి
RELATED ARTICLES

