ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeతెలంగాణవికారాబాద్ఆపరేషన్ ముస్కాన్–XII ద్వారా 125 మంది చిన్నారుల రక్షణ – జిల్లా ఎస్పీస్నేహ మెహ్రా,

ఆపరేషన్ ముస్కాన్–XII ద్వారా 125 మంది చిన్నారుల రక్షణ – జిల్లా ఎస్పీస్నేహ మెహ్రా,

📰 Generate e-Paper Clip

వికారాబాద్,అర్జున్ సమాచారం:
జిల్లా వ్యాప్తంగా అన్నీ శాఖల సమన్వయం తో  ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, భిక్షాటన, విద్యకు దూరమైన చిన్నారులను గుర్తించి రక్షించేందుకు జిల్లా పోలీసులు సంబంధిత శాఖలతో సమన్వయంగా విస్తృత చర్యలు చేపట్టినట్టు  జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, గత నెల మొదటి నుండి  31-07-2026 వరకు  జిల్లాలో మొత్తం 125 మంది చిన్నారులను రక్షించినట్లు తెలిపారు. వీరిలో 116 మంది బాలురు, 9 మంది బాలికలు ఉన్నారు. రక్షించబడిన చిన్నారుల్లో 97 మంది బాల కార్మికులు, 26 మంది చదువు మానేసిన (డ్రాప్‌ఔట్) చిన్నారులు, ఒకరు భిక్షాటనలో ఉన్న చిన్నారి, ఒక బాల్య వివాహాన్ని అడ్డుకుని సంబంధిత చిన్నారిని రక్షించినట్లు తెలిపారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన 41 మంది చిన్నారులను కూడా గుర్తించి రక్షించినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ ముస్కాన్–XIIలో భాగంగా ఇప్పటి వరకు 54 కేసులు (FIRలు) నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే రక్షించిన చిన్నారుల్లో 89 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించగా, 36 మందిని బాలల సంరక్షణ గృహాలకు తరలించినట్లు వెల్లడించారు.
జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS మాట్లాడుతూ, బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, చిన్నారుల అక్రమ రవాణా, భిక్షాటన, పిల్లలను చదువుకు దూరం చేసే చర్యలపై జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని తెలిపారు.

చిన్నారుల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాల కార్మికులు లేదా ప్రమాదంలో ఉన్న చిన్నారులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–100, చైల్డ్ హెల్ప్‌లైన్–1098కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్–XIIను మరింత సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రతి చిన్నారి సురక్షితమైన, విద్యతో కూడిన భవిష్యత్తు పొందేలా అన్ని శాఖలతో కలిసి కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు
===========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!