ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeసినిమాకార్తి, మోహన్ రాజా, ఎస్. లక్ష్మణ్ కుమార్, ప్రిన్స్ పిక్చర్స్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్

కార్తి, మోహన్ రాజా, ఎస్. లక్ష్మణ్ కుమార్, ప్రిన్స్ పిక్చర్స్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్

📰 Generate e-Paper Clip

ప్రిన్స్ పిక్చర్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. హీరో కార్తీ, ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్‌లో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం కుటుంబ భావోద్వేగాలతో పాటు హీరోయిజాన్ని అద్భుతంగా మేళవించిన ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.
కార్తీ, మోహన్ రాజా కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌లో కార్తీకి ఇది వరుసగా నాలుగో చిత్రం. ఇంతకుముందు ‘దేవ్’, ‘సర్దార్’, ‘సర్దార్ 2’ చిత్రాల తర్వాత మరోసారి ఈ బ్యానర్‌తో ఆయన చేతులు కలపడం విశేషం. ముఖ్యంగా ‘సర్దార్ 2’ విడుదలకంటే ముందే ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించడం కార్తీ, ప్రిన్స్ పిక్చర్స్ మధ్య ఉన్న బలమైన అనుబంధానికి నిదర్శనం. ఈ సినిమాపై కేవలం ప్రకటనతోనే సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
బలమైన భావోద్వేగాలు, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను మేళవిస్తూ మంచి సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ రాజా, ఈ చిత్రంలో కార్తీని మరో కొత్త, పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించబోతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం, రెగ్యులర్ షూటింగ్ తదితర వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
తారాగణం: కార్తీ
============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!