ePaper
Sunday, August 16, 2026
ePaper
Homeసినిమానయనతార 'హాయ్' మూవీ ఆగస్టు 28న గ్రాండ్ రిలీజ్

నయనతార ‘హాయ్’ మూవీ ఆగస్టు 28న గ్రాండ్ రిలీజ్

📰 Generate e-Paper Clip

లేడీ సూపర్ స్టార్ నయనతార, కవిన్ తొలిసారి కలిసి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఆగస్టు 28న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విష్ణు  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార, కవిన్‌తో పాటు కె. భాగ్యరాజ్, ప్రభు, రాధికా శరత్‌కుమార్, వీటీవీ గణేష్, సత్యన్, ఆదిత్య కథిర్, ఖురైషి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజేష్ శుక్లా సినిమాటోగ్రఫీ అందించగా, జెన్ మార్టిన్ సంగీతం సమకూర్చారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, ఎస్. కన్నన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై నయనతార, విఘ్నేష్ శివన్, ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినోద్ సి.జే., కె.ఎస్. మయిల్ వాగనన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, వి.కె. కుబీంద్రన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.
ఇప్పటికే విడుదలైన తొలి పాటకు డిజిటల్ వేదికల్లో మిలియన్ల వ్యూస్ రావడంతో పాటు అద్భుతమైన స్పందన లభించింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌తో పాటు ఆగస్టు 28 విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
దర్శకుడు విష్ణు మాట్లాడుతూ, “‘హాయ్’ టైటిల్‌లాగే ఇది ఒక సింపుల్, హార్ట్‌వార్మింగ్, ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. చెన్నై, కోయంబత్తూరు, పొల్లాచ్చి నేపథ్యాల్లో సాగే ఈ సినిమా కుటుంబం మొత్తం కలిసి థియేటర్‌లో చూసి ఆస్వాదించేలా రూపొందించాం. ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’, ‘సంతోష్ సుబ్రమణ్యం’, ‘యారాడి నీ మోహిని’ వంటి చిత్రాల తరహాలో బంధాలు, భావోద్వేగాలు, హాస్యంతో సాగే కథ ఇది.
గేయ రచయితగా ఇప్పటికే ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి పనిచేసిన విష్ణు కు ఇది దర్శకుడిగా తొలి చిత్రం. నయనతార-కవిన్ ఫస్ట్ టైమ్ ఆన్‌స్క్రీన్ జోడీ కావడం, బలమైన తారాగణం, ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ‘హాయ్’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!