భూపాలపల్లి,అర్జున్ సమాచారం:
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా భూపాలపల్లి జిల్లాకు వచ్చిన డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు అధికారులతో నేరాల నియంత్రణ, సైబర్ నేరాలు, గంజాయి అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల భద్రత తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతన జిమ్ సెంటర్ను ప్రారంభించి, సిబ్బంది ఆరోగ్యం, శారీరక దృఢత్వంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. అరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా పోలీసు సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేసి, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీసులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.
============================
భూపాలపల్లిలో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన
RELATED ARTICLES

