ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeతెలంగాణమంత్రి సీతక్క చొరవతో అంగన్‌వాడీ సిబ్బందికి పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ 60 ఏళ్లు దాటిన వారు...

మంత్రి సీతక్క చొరవతో అంగన్‌వాడీ సిబ్బందికి పెరిగిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ 60 ఏళ్లు దాటిన వారు స్వచ్ఛందంగా వైదొలిగినా ప్రయోజనం ఇప్పటివరకు 2,572 మందికి రూ.15.61 కోట్ల చెల్లింపు

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:                                                                                                                                      అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం పెంచిన సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ అందిస్తోంది. 65 ఏళ్ల వయస్సులో రిటైర్ అయిన వారికి పెంచిన మొత్తంతో పాటు, 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగినా ఈ ప్రయోజనాలు వర్తింపజేస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేస్తోంది.
2023లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అంగన్‌వాడీ టీచర్లకు రూ.1 లక్ష, అంగన్‌వాడీ హెల్పర్లు, మినీ అంగన్‌వాడీ వర్కర్లకు రూ.50 వేలుగా ఉన్న సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్‌ను మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో 2025 మే 30న ప్రజా ప్రభుత్వం పెంచింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం 65 ఏళ్ల వయస్సులో వైదొలిగే అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, అంగన్‌వాడీ హెల్పర్లకు రూ.1 లక్ష చొప్పున అందిస్తున్నారు.
అదే విధంగా 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగిన సందర్భంలో కూడా అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష చొప్పున వాలంటరీ డిస్‌ఎంగేజ్‌మెంట్ బెనిఫిట్ అందించే అవకాశం కల్పించారు.
రూ.15.61 కోట్లు చెల్లింపు
2026–27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 2,572 మంది అంగన్‌వాడీ సిబ్బంది ఖాతాలకు రూ.15,61,10,000 సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్‌గా చెల్లించారు.
ఇందులో 473 మంది అంగన్‌వాడీ టీచర్లకు రూ.4.73 కోట్లు, 1,930 మంది అంగన్‌వాడీ హెల్పర్లకు రూ.9.65 కోట్లు చెల్లించారు. పెంచిన బెనిఫిట్స్ ప్రకారం మరో 14 మంది అంగన్‌వాడీ టీచర్లకు రూ.28 లక్షలు, 59 మంది అంగన్‌వాడీ హెల్పర్లకు రూ.59 లక్షలు అందించారు. గతంలో అమల్లో ఉన్న ఉత్తర్వుల ప్రకారం మరో 96 మంది అంగన్‌వాడీ సిబ్బందికి రూ.36.10 లక్షలు చెల్లించారు. గత ప్రభుత్వంలో రిటైర్ అయిన అంగన్వాడీ సిబ్బందికి సైతం ఈ ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించింది.
అంగన్‌వాడీ సిబ్బందికి పదవీ విరమణ అనంతరం ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, దీర్ఘకాలంగా సేవలందించిన వారికి గౌరవప్రదమైన ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది
====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!