యాదవ సంఘాన్ని బలోపేతం చేస్తాం.ముత్తారం మండల అధ్యక్షుడు చెల్కల జితేందర్ యాదవ్‌కు ఘన సన్మానం.
అర్జున్ సమాచారం// అక్టోబర్ //8.ముత్తారం. రిపోర్టర్.
మండలం లోని యాదవ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చెల్కల జితేందర్ యాదవ్‌కు రామగిరి మండల కేంద్రంలో యాదవ సంఘం నాయకులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంధవేణి రాజేందర్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జితేందర్ యాదవ్ నాయకత్వంలో ముత్తారం మండలంలో యాదవ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. యాదవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజాసేవలో ముందుండాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఉడుత పర్వతాలు యాదవ్, మంథని మండల అధ్యక్షుడు పర్ష మోహన్ యాదవ్, గిరవేన రాములు యాదవ్, ఫకీరా యాదవ్, తిరుపతి యాదవ్, యుగేందర్ యాదవ్, కొడారి మల్లేశం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

