ePaper
Saturday, August 22, 2026
ePaper
Homeఎడిటోరియల్పిల్లల కోసం..ఆంధ్రను మించి తమిళనాడు .

పిల్లల కోసం..ఆంధ్రను మించి తమిళనాడు .

📰 Generate e-Paper Clip

పిల్లల కోసం..ఆంధ్రను మించి తమిళనాడు .

చెన్నై, ఆగస్టు 20, (అర్జున్ సమాచారం ప్రతినిధి తమిళనాడు, ఆగస్టు 20,)

ప్పటి వరకు ఇద్దరే ముద్దు అని ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని ప్రోత్సహిస్తున్నాయి. మూడో బిడ్డ పుడితే నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పుడు అదే బాటలో వెళ్తున్న తమిళనాడు సీఎం విజయ్ కీలక ప్రకటన చేశారు. తమిళనాడు విజయ ప్రభుత్వం, మూడో బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 365 రోజులకు అంటే ఒక ఏడాదికి పెంచింది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కల్పించింది. అసెంబ్లీలో శాఖాపరమైన డిమాండ్లపై జరిగిన చర్చ సందర్భంగా తమిళనాడు మంత్రి డి. శరత్‌కుమార్ ఈ ప్రకటన చేశారు. ఇప్పటివరకు మొదటి ఇద్దరు పిల్లలకు మాత్రమే 365 రోజుల సెలవు ఇచ్చేవారని, మూడో బిడ్డకు ఈ పరిమితి 12 వారాలుగా ఉండేదని, ఇప్పుడు రెండింటినీ సమానం చేశామని ఆయన తెలిపారు.తమిళనాడు అసెంబ్లీలో ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ, ప్రభుత్వం సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ఒక మంత్రి తెలిపారు. త్వరలో అధికారిక ప్రభుత్వ ఉత్తర్వు జారీ అవుతాయి. S.ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఇద్దరికంటే తక్కువ మంది పిల్లలు ఉన్న సాధారణ మహిళా ఉద్యోగులు మాత్రమే 365 రోజుల ప్రసూతి సెలవుకు అర్హులు. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రసూతి సెలవు కాలాన్ని క్రమంగా పెంచుతూ వచ్చింది. ప్రారంభంలో ఉన్న 90 రోజుల సెలవును 2011లో ఆరు నెలలకు, ఆ తర్వాత 2016లో తొమ్మిది నెలలకు, జూలై 2021లో పూర్తి 365 రోజులకు (ఒక సంవత్సరం) పెంచారు.సుప్రీంకోర్టు ఆదేశాలు,రాష్ట్ర ప్రభుత్వ సవరణల ప్రకారం, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న మహిళా ఉద్యోగులకు కేవలం 12 వారాల (84 రోజుల) పూర్తి వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మాత్రమే లభించేది. ఇప్పుడు విజయ్ ప్రభుత్వం, మూడో బిడ్డకు కూడా వర్తించే విధంగా ఒక సంవత్సరం ప్రసూతి సెలవును ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్ చాలా కాలం నుంచి అనురిస్తున్న జనాభా నియంత్రణ విధానాన్ని భిన్నంగా చంద్రబాబు గతంలోనే వరాలు ప్రకటించారు. జనాభా నియంత్రణ వల్ల భవిష్యత్‌లో దేశం అనేక సమస్యలను ఎదుర్కోబోతోందని అందుకే జనాభా అవసరమని చెప్పుకొస్తున్నారు. పిల్లలను భారంగా కాకుండా సంపదగా భావించాలని సూచించారు. అందుకే ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ పిలుపునిచ్చారు. దీని కోసం ప్రభుత్వమే ఆర్థిక సాయం చేస్తుందని వెల్లడించారు. మూడో బిడ్డను కంటే 30వేలు నాల్గో బిడ్డను కంటే 40వేలు తల్లుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తల్లి ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయని, కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా, వారి పోషకాహారం, చదువు బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. సమగ్రమైన స్కీమ్‌ను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!