ePaper
Friday, August 21, 2026
ePaper
Homeతెలంగాణఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.

📰 Generate e-Paper Clip

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.

జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం ఆగస్టు 20 :

జన్నారం మండల కేంద్రంలో ని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 సంవత్సరాల వయస్సులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ గారు భారత ప్రధానమంత్రి పదవి నిర్వహించినవారిలో అతి పిన్న వయస్కుడు అని,ప్రభుత్వం ఆధునీకరణ ఉదారీకరణలపై దృష్టి సారించారు అని, భారతదేశం ఆయన్ని సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు అని దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం ఘనత అతనికే చెందుతుంది అని, స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు అని, ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అజ్మీరా నందునాయక్, పట్టణ అధ్యక్షులు మంద రాజేష్, ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం,జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇస్సాక్, ముజాఫర్,జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం మోహన్ రెడ్డి,SC సెల్ అధ్యక్షులు మామిడి పెల్లి ఇందయ్య, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు కుదిరే వెంకన్న, సీనియర్ నాయకులు మచ్చ శంకరయ్య,ముత్యం సతీష్, సుధాకర్ నాయక్, దూమల్ల రమేష్,షాకిర్, అరే శిరీష్,నర్సింగ్ రావు,బండారి స్వామి, గోవింద్, భాస్కర్,ధర్ము నాయక్,దూమల్ల ప్రవీణ్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి గణేష్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!