ePaper
Sunday, August 23, 2026
ePaper
Homeతెలంగాణపుట్టా మధూ.. నోరు అదుపులో పెట్టుకోశ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారు:...

పుట్టా మధూ.. నోరు అదుపులో పెట్టుకోశ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారు: తొట్ల తిరుపతి యాదవ్

📰 Generate e-Paper Clip

పుట్టా మధూ.. నోరు అదుపులో పెట్టుకోశ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారు: తొట్ల తిరుపతి యాదవ్.

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 22.

మంథని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై కాంగ్రెస్‌ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పుట్ట మధు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని మంథని బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్‌ హెచ్చరించారు. రామగిరి మండలం బేగంపేట ఎక్స్‌రోడ్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయంలో రామగిరి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రొడ్డ బాపన్న పటేల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణకు హాజరైన పుట్ట మధు ఫ్రస్ట్రేషన్‌లోనే శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ఉనికి కోల్పోతాననే భయంతో మతిభ్రమించినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వందల కోట్ల రూపాయల నిధులతో మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న శ్రీధర్‌బాబు పనితీరును చూసి ఓర్వలేకనే పుట్ట మధు అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. నిరుద్యోగ నిర్మూలన, పరిశ్రమలు, పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడమే లక్ష్యంగా శ్రీధర్‌బాబు నిరంతరం కృషి చేస్తున్నారని, అలాంటి నాయకుడిని విమర్శించే నైతిక అర్హత పుట్ట మధుకు లేదన్నారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో మంథని ప్రాంతాన్ని ఇసుక, మట్టి మాఫియాలకు అడ్డాగా మార్చి, హత్యలు, అలజడులతో ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసిన చరిత్ర పుట్ట మధుదేనని ఆరోపించారు. నాలుగు దశాబ్దాలుగా మంథని ప్రజలు కాంగ్రెస్‌ కుటుంబాన్ని ఎందుకు ఆదరిస్తున్నారో పుట్ట మధు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. శ్రీపాదరావు, శ్రీధర్‌బాబు కుటుంబానికి మంథని ప్రజలు పదేపదే పట్టం కడుతున్నారంటే ప్రజల విశ్వాసమే అందుకు నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్‌ హోదాలకు ఉన్న గౌరవాన్ని కాపాడుకునేలా పుట్ట మధు వ్యవహరించాలని, వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే పుట్ట మధు వ్యాఖ్యలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. మంథని నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, శ్రీధర్‌బాబు నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ మరింత బలోపేతం కావాలని కాంగ్రెస్‌ శ్రేణులు ఆయన వెంట నడుస్తాయని తొట్ల తిరుపతి యాదవ్‌ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడు ఎల్లే రామ్మూర్తి, మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్‌, రామగిరి మండల బీసీ సెల్‌ అధ్యక్షుడు బండారి సదానందం, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కండె పోషం, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మోత్కూరి అవినాష్‌గౌడ్‌, సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్‌ సత్యనారాయణగౌడ్‌, పన్నూర్‌ సర్పంచ్‌ చిందం మహేష్‌, నవాబ్‌పేట సర్పంచ్‌ రొడ్డ మౌనిక, కుమార్‌ సర్పంచ్‌, ఆదివారం పేట సర్పంచ్‌ ఇల్లందుల సంజీవ్‌, నాగపల్లి సర్పంచ్‌ కొండవేణ దివ్య సుధాకర్‌, కాలేశ్వరం దేవస్థానం డైరెక్టర్‌ కాటం సత్యం, మాజీ సర్పంచ్‌లు తీగల సమ్మయ్య, ఎరుకల బాబురావు, జిల్లా యువజన నాయకులు గొర్రె నరేష్‌ యాదవ్‌, మట్ట రాజు, పన్నూర్‌ ఉప సర్పంచ్‌ కావేటి మల్లేశ్వరి, మహిళా కాంగ్రెస్‌ నాయకులు జాగరి రజిత, విజయ, రత్నాపూర్‌ కాంగ్రెస్‌ నాయకులు బర్ల శ్రీకాంత్‌, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ఉప సర్పంచ్‌ నరేష్‌ యాదవ్‌, స్టాలిన్‌, గ్రామ యువజన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!