ePaper
Saturday, August 22, 2026
ePaper
Homeతెలంగాణరాజన్న సిరిసిల్లప్రణాళిక ప్రకారం రాజన్న ఆలయ నిర్మాణ పనులు చేపట్టాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ప్రణాళిక ప్రకారం రాజన్న ఆలయ నిర్మాణ పనులు చేపట్టాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

📰 Generate e-Paper Clip

రాజన్న  సిరిసిల్ల,అర్జున్ సమాచారం:
వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (వీ టీఏడీఏ) ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ పట్టణంలో వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ శనివారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులను ప్రణాళిక ప్రకారం చేపట్టి, వేగవంతంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు జరిగిన పురోగతిని అధికారులను అడిగి జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని, నిర్మాణ ప్రక్రియలో జాప్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిత్యాన్నదాన సత్రం నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలన్నారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసేందుకు మరింత మంది కూలీల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులను పరిశీలించిన కలెక్టర్ గడువులోగా ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పనులు పూర్తి చేసేలా చూడాలని, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు.సమావేశంలో ఆర్ అండ్ బీ సీఈ రాజేశ్వర్ రెడ్డి, ఎస్ఈ భీమ్లా నాయక్, ఆలయ ఈవో రమాదేవి, ఆర్ అండ్ బీ డీఈ శాంతయ్య, మోతిలాల్ స్థపతి, సూర్యనారాయణ మూర్తి, తదితరులు ఉన్నారు
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!