ఉత్తమ ఏపీఓ జయదేవ్‌కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన సన్మానం.
జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం ఆగస్టు 22 :
నిర్మల్ జిల్లా.కడెం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఏపీఓ అవార్డు అందుకున్న కడెం ఏపీఓ జయదేవ్ గారిని శుక్రవారం కడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు గంగన్న గారి ఆధ్వర్యంలో కడెం ఉపాధి హామీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బొడ్డు గంగన్న మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేసే అధికారులకు లభించే గుర్తింపు సమాజానికి ఆదర్శమని అన్నారు. జయదేవ్ గారికి దక్కిన ఉత్తమ ఏపీఓ అవార్డు కడెం మండలానికి గర్వకారణమని పేర్కొంటూ, ప్రజాసేవలో ఇదే అంకితభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ విభాగం మండల అధ్యక్షులు జడా రాజేశ్వర్, మైనార్టీ విభాగం మండల అధ్యక్షులు సలీం, నాయకులు గంగాధర్ గౌడ్, నాగేశ్, FA రామన్న తదితరులు పాల్గొన్నారు.

