ePaper
Monday, August 24, 2026
ePaper
Homeరామగుండంరాఖీ పండుగ వేళ సింగరేణి కార్మికులకు ఆత్మీయ పలకరింపు ఆర్జీ-1 సింగరేణి గనుల...

రాఖీ పండుగ వేళ సింగరేణి కార్మికులకు ఆత్మీయ పలకరింపు ఆర్జీ-1 సింగరేణి గనుల వద్ద కార్మికులకు రాఖీలు కట్టిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి కార్మికుల చేతులకు రాఖీలు కట్టి.. స్వీట్లు తినిపించిన బీజేపీ శ్రేణులు అన్నా–చెల్లెలు, అక్క–తమ్ముళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక: కందుల సంధ్యారాణి

📰 Generate e-Paper Clip

 గోదావరిఖని,అర్జున్ సమాచారం:

అన్నా–చెల్లెలు, అక్క–తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి బీజేపీ శ్రేణులతో కలిసి గోదావరిఖనిలోని ఆర్జీ-1 సింగరేణి గనుల వద్దకు వెళ్లారు.

ఈ సందర్భంగా గనుల్లో విధులు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికులను ఆప్యాయంగా పలకరించి  వారి చేతులకు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కార్మికులతో కొద్దిసేపు ముచ్చటిస్తూ వారి క్షేమ సమాచారాన్ని, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ.. కుటుంబంలో ఎన్ని కోపతాపాలు, విభేదాలు ఉన్నప్పటికీ రాఖీ పండుగ రోజున అందరూ ఒక్కటై సుఖసంతోషాలతో గడుపుతారని అన్నారు. అన్నా–చెల్లెలు, అక్క–తమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయత, అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రాఖీ పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు ముందస్తుగా ఆత్మీయతను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కుటుంబ సభ్యుల మాదిరిగానే సింగరేణి కార్మికుల మధ్య కూడా ఐకమత్యం, సోదరభావం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు.
సింగరేణి కార్మికులు తమ కష్టాన్ని, శ్రమను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె కొనియాడారు. వారి సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.
రాఖీ పండుగ సందర్భంగా సింగరేణి కార్మికుల పట్ల బీజేపీ శ్రేణులు చూపిన ఆప్యాయత అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో  లక్ష్మీ నగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ కోడూరి రమేష్, బియ్యాల మహేందర్, పాకాల నరసింహారెడ్డి, బూడిద హర్ష, కొట్టే నరేష్, శ్రీనివాస్, చింతం అంజి, గంగరాజు, ఎల్తూరి సరిత-రాజయ్య, మీసవికాస్ తదితరులు పాల్గొన్నారు..
============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!