ePaper
Monday, August 24, 2026
ePaper
Homeరామగుండంవెలుగులోకి " ఖని " ప్రయాణ ప్రాంగణం. గోదావరిఖని:

వెలుగులోకి ” ఖని ” ప్రయాణ ప్రాంగణం. గోదావరిఖని:

📰 Generate e-Paper Clip

గోదావరిఖని,అర్జున్ సమాచారం:
గోదావరిఖని ప్రయాణ ప్రాంగణం రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే  మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్  చొరవతో  వెలుగులోకి ప్రయాణ ప్రాంగణం రావడం స్థానిక ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గోదావరిఖని ప్రయాణ ప్రాంగణం ప్రయాణికులకు, స్థానిక ప్రజలకు సుందరంగా కనిపించే విధంగా ప్రయాణ ప్రాంగణం కు అడ్డుగా ఉన్న చెట్లను, దుకాణాలను  తొలగించడం మూలంగా  గోదావరిఖని  ప్రయాణ ప్రాంగణం అందరికీ కనిపించేలా విధంగా సుందరంగా తయారు చేశారు.  ఇంతకు పూర్వము  గోదావరిఖని ప్రయాణ ప్రాంగణం భారీ చెట్ల మూలంగా, దుకాణాల సముదాయంతో  ప్రయాణ ప్రాంగణం ప్రయాణికులకు, ప్రజలకు కనిపించకపోవడంతో ప్రయాణ  ప్రాంగణం ఎక్కడ ఉంది అని తెలిసేది కాదు ప్రస్తుతము ప్రయాణ ప్రాంగణం కు అడ్డుగా ఉన్న వాటిని తొలగించడంతో ప్రయాణికులకు, ప్రజలకు గోదావరిఖని ప్రయాణ ప్రాంగణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం  గోదావరిఖని ప్రయాణ ప్రాంగణం అందరికీ కనిపించేలాగా రాత్రి పూట ఐమాక్స్ లైటింగ్లతో  సుందరంగా కనిపించేలాగా  స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్   రాజ్ ఠాకూర్ చొరవ తీసుకున్నారు. ప్రయాణం ప్రాంగణం ముందు    భారీ వాహనాలకు, ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్న  ఆటోలను సైతం
ప్రయాణ ప్రాంగణానికి  దూరంగా మార్చారు. గోదావరిఖని ప్రయాణికులకు ప్రయాణ ప్రాంగణం కనిపించేలాగా చేసిన రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ కు స్థానిక ప్రజలు, ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.
========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!