ePaper
Wednesday, August 26, 2026
ePaper
Homeసినిమా"రోమాంచకం" మూవీ ట్రైలర్ లాంచ్

“రోమాంచకం” మూవీ ట్రైలర్ లాంచ్

📰 Generate e-Paper Clip

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు “రోమాంచకం” చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
కాస్ట్యూమ్ డిజైనర్ కీర్తన మాట్లాడుతూ – ఈ సినిమా కోసం నేను డిఫరెంట్ గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేందుకు ప్రయత్నించాను. అందుకు మా అమ్మ, అమ్మమ్మ వాళ్ల చీరలు కట్ చేసి కొత్త కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాను. ఈ సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు మేము కొత్త వాళ్లం అనే ఫీల్ ను రానీయలేదు మా డైరెక్టర్, ప్రొడ్యూసర్. “రోమాంచకం” సినిమా మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్ మాట్లాడుతూ – నేను సందీప్ వంగా గారిని అభిమానిస్తాను. మీలాగే ఆయన సినిమాలను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేశాను. భద్రకాళీ సంస్థలో పనిచేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా. నాకు తెలుగు పూర్తిగా రాదు. అయినా ఈ సినిమా చూస్తూ నేలపై పడి నవ్వుకున్నాను. అంతగా నవ్వించే చిత్రమిది. మొదటి ఫ్రేమ్ నుంచి చివరి దాకా మిమ్మల్ని హిలేరియస్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. మా బెంగళూరులోనూ ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటాం. అన్నారు.
డీవోపీ పవన్ పప్పుల మాట్లాడుతూ – మా మూవీ ట్రైలర్ ను మీరంతా ఎంజాయ్ చేశారు. అలాగే సినిమాను కూడా ఇష్టపడతారని నమ్ముతున్నాను. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం కల్పించిన మా డైరెక్టర్ వేణు గారికి, మా ప్రొడ్యూసర్స్ సందీప్ వంగా, ప్రణయ్ వంగా గారికి థ్యాంక్స్. అన్నారు.
యాక్టర్ వెంకటేష్ కాకుమాను మాట్లాడుతూ – మా మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ కెమిస్ట్రీ కంటే మా  బాయ్స్ చేసే సరదా సందడి మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకుంటుంది. నేను ఇప్పటిదాకా చేయని క్యారెక్టర్ ఈ చిత్రంలో చేశాను. మీరంతా మా సినిమాను మరింతగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ మాట్లాడుతూ – మా సినిమా చూసి ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. మా చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నేను బాగుంటానని నమ్మి అవకాశం కల్పించిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. ఈ టీమ్ లోని అందరితో హ్యాపీగా వర్క్ చేశాను. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ ఏంటో ఫీల్ కావాలంటే సెప్టెంబర్ 3న మా మూవీ చూసేందుకు థియేటర్స్ కు రండి. ఈ సినిమా సెట్ లో జాయిన్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ ఫీల్ తో వర్క్ చేశాం. అన్నారు.
డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ – ఈ రోజు మా అందరి కంటే సందీప్ అన్న మాట్లాడితే బాగుంటుంది. ఆయన స్పీచ్ కోసం మేమంతా వెయిట్ చేస్తున్నాం. నెక్ట్స్ ఈవెంట్స్ లో మా సినిమా గురించి మాట్లాడుతాను. అన్నారు.
ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ – మా మూవీకి వర్క్ చేసిన యంగ్ టీమ్ కోసం ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఈ సినిమా విజయం మా భద్రకాళీ సంస్థ కంటే వాళ్లకు ఎక్కువ అవసరం. ఈ సినిమా విజయంతో మా డైరెక్టర్ వేణు, మా హీరో, మా హీరోయిన్, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కు పేరు రావాలి. వీళ్లంతా దాదాపు కొత్త వాళ్లే, రెండు మూడు సినిమాలు చేసిన వాళ్లే. వాళ్లకు రోమాచకం సినిమా సక్సెస్ తో గుర్తింపు వచ్చి, మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ – సొంత బ్రదర్స్ లా నన్ను ఎంకరేజ్ చేస్తున్న మా సందీప్ అన్న, ప్రణయ్ అన్నకు థ్యాంక్స్. రోమాంచకం క్యూట్ లవ్ ఫిలిం. భద్రకాళీ సంస్థలో ట్రావెల్ అవుతుంటే తెలిసింది సందీప్ అన్న, ప్రణయ్ అన్న ఎంత మంచి మనసున్న  వాళ్లో. యాక్టర్ గా ఓపెన్ అప్ అయిపోయి నటించే అందరినీ నవ్వించే అందరూ ఇష్టపడే ఇలాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్ లో నటించే అవకాశం నాకు కల్పించిన మా డైరెక్టర్ వేణు అన్నకు కృతజ్ఞతలు. అనంతిక మంచి పర్ ఫార్మర్, ఏ విద్య నేర్చుకోమన్నా త్వరగా నేర్చుకుంటుంది. సోహన్, వెంకటేష్, నరేంద్ర,..ఇలా మా బ్యాచ్ అంతా నిజంగా స్నేహితులా అనేంత సహజంగా కనిపిస్తాం. నరేంద్ర చేసిన చింటు క్యారెక్టర్ మీ అందరికీ గుర్తుండిపోతుంది. ట్రైలర్ మీ అందరికీ నచ్చితే థియేటర్స్ కు వచ్చేయండి, మీతో పాటు మరికొందరిని తీసుకురండి. భద్రకాళీ పిక్చర్స్ లో వస్తున్న ఫన్ క్యూట్ ఎంటర్ టైనర్ ఇది. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరితో చూసినా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎవర్ని సినిమాకు తీసుకువెళ్లినా డిజప్పాయింట్ కారు. ఆ కాన్ఫిడెంట్ తో సినిమాకు వెళ్లండి. అన్నారు.
చిత్ర సమర్పకులు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ – నేను రోమాంచకం సినిమా చూశాను. చాలా బాగుంది. ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఇన్నోసెంట్ గా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ లో పర్ ఫార్మ్ చేసి మెప్పించడం కష్టం. హీరో, హీరోయిన్, వారి స్నేహితుల క్యారెక్టర్స్ చూస్తుంటే సినిమాలా అనిపించదు. పక్క నుండి వీళ్లను చూస్తున్నట్లు అనిపిస్తుంటుంది. నేను కథ విన్నాను, ఫస్ట్ కట్ చూశాను. అంతే ఒక్క రోజు కూడా షూటింగ్ కు వెళ్లలేదు, వాళ్లను డిస్ట్రబ్ చేయలేదు. నాకు మైక్రో మేనేజ్ మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే వాళ్లను డిస్ట్రబ్ చేస్తానని షూటింగ్ కు వెళ్లలేదు. కథ విన్నప్పుడు నేను ఎంతగా నవ్వుకున్నానో, సినిమా చూశాక అంతకంటే ఎక్కువ నవ్వాను. ఇది సూపర్ హిలేరియస్ మూవీ. ఫస్ట్ టైమ్ మా భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ సినిమాకు క్లీన్ యూ బై ఎ సెన్సార్ సర్టిఫికెట్ వస్తోంది. అన్నీ ఎ సర్టిఫికెట్ లు వచ్చేవి. రాబోయో స్పిరిట్ కు కూడా ఎ సర్టిఫికెట్ నే వస్తుంది. ఎన్నిసార్లు మేము ఫ్యామిలీస్ తో మా సినిమాకు రావాలని చెప్పినా మీరు రాలేదు. ఈ సినిమాకు ఫ్యామిలీతో పాటు రండి. మ్యూజిక్ చాలా బాగుంది. సినిమా చూస్తున్నంత సేపు టైమ్ తెలియలేదు. అప్పుడే ఇంటర్వెల్ వచ్చిందా అనుకున్నా. ట్రైలర్ సరదాగా ఎలా ఉందో  సినిమా కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమాను డెఫనెట్ గా ప్రేక్షకులు చూస్తారు. సినిమా అంతా ఒక ఫ్లోలో కామెడీతో వెళ్తుంటుంది. ట్రైలర్ కోసం ఎక్కడ సీన్స్ కట్ చేయాలో తెలియలేదు. ఇలాంటి స్క్రిప్ట్ నేను రాయలేను. కామెడీకి ఎజెండా ఏమీ ఉండదు, నవ్వించాలి. సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకోకుండా ఈ రోజుల్లో స్క్రిప్ట్ రాయడం కష్టం. కానీ ఈ సినిమాకు ఆ సినిమాటిక్ అడ్వాంటేజ్ చాలా తక్కువ తీసుకున్నారు. నాకు ఈ మూవీలో నచ్చిన విషయాల్లో అదొకటి. ప్రభాస్ అన్నతో సినిమా చేయడమే నా లైఫ్ లో రోమాంచకం మూవ్ మెంట్. అన్నారు.
నటీనటులు – సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్, ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్, తదితరులు
================================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!